వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. టీవీలు మరింత ప్రియం

కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా.? ఏదైనా ఆఫర్‌లో ట్రై చేస్తే తక్కువ ధరకే టీవీ కొనవచ్చునని ఆలోచిస్తున్నారా.? ఇక నుంచి నో ఛాన్స్. గతంలో మాదిరిగా ఇకపై టీవీలు తక్కువ ధరకు కొనలేరు.

వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. టీవీలు మరింత ప్రియం
Follow us

|

Updated on: Oct 01, 2020 | 5:43 PM

Television sets to get costlier: కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా.? ఏదైనా ఆఫర్‌లో ట్రై చేస్తే తక్కువ ధరకే టీవీ కొనవచ్చునని ఆలోచిస్తున్నారా.? ఇక నుంచి నో ఛాన్స్. గతంలో మాదిరిగా ఇకపై టీవీలు తక్కువ ధరకు కొనలేరు. అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పలు వస్తువులపై విధించిన అదనపు పన్ను వల్ల టీవీలు మరింత ప్రియం కానున్నాయి. టీవీలో వాడే ఓపెన్ సెల్ ప్యానల్స్‌పై ఇవాళ్టి నుంచి 5 శాతం కస్టమ్ సుంకాన్ని విధించింది.

దీని వల్ల భారత్‌లో విరివిగా అమ్ముడుపోయే 32 అంగుళాల టీవీ రూ.600 వరకు పెరగనుండగా.. 42 అంగుళాల టీవీలు రూ. 1200 నుంచి రూ.1500 వరకు పెరగనున్నాయి. వీటికి మళ్లీ జీఎస్టీ అదనం. వాస్తవానికి టీవీ ధరలో 60 శాతం ఖర్చు స్క్రీన్‌ను తయారు చేసే ఓపెన్ సెల్ ప్యానల్‌దే. తాజాగా ఓపెన్ సెల్‌పై 5% కస్టమ్ సుంకాన్ని విధించడం వల్ల ఒక్కో టీవీ రూ. 250 కంటే ఎక్కువ పెరగదని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.

అంతేకాదు ప్రముఖ బ్రాండింగ్ కంపెనీలు దిగుమతి చేసుకునే ఓపెన్ సెల్‌ 32 అంగుళాల టీవీకి రూ .2,700, 42 అంగుళాల టెలివిజన్‌కు రూ.4,000 నుండి రూ .4,500 వరకు ధర ఉంటుంది. పండుగ సీజన్ కాబట్టి కేంద్రం డిసెంబర్ వరకు అదనపు పన్ను విధించదని.. కేవలం తాత్కాలికంగానే విధిస్తుందని టెలివిజన్ తయారీదారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం పొడిగింపు విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.

Also Read:

ఏపీ పింఛన్‌దారులకు శుభవార్త.. కొత్తగా 34,907 మందికి లబ్ది..

ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు ఇవే!

మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!

ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం ధర..