మొబైల్ వినియోగదారులపై కాల్ ఛార్జీల భారం !

మొబైల్ వినియోగదారులకు షాకింగ్  న్యూస్..! ఇక మీ మొబైల్ బిల్లు సాగి బారెడు కాబోతుంది..! అవును.. కాల్ ఛార్జీలకు రెక్కలు రానున్నాయి. మరో రెండు మూడు రోజుల్లోనే వినియోగదారులపై కాల్ ఛార్జీల భారం పడనుంది. డిసెంబర్ నెల నుంచే టారిఫ్ లు పెంచేందుకు ఎయిర్ టెల్, రిలయెన్స్, జియో, వోడాఫోన్, ఐడియా, బీఎస్ ఎన్ ఎల్ లు భారీగా ధరలు పెంచేందుకు సిద్దంగా ఉన్నాయి. పెరిగిన ధరలతో కస్టమర్స్ జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు […]

మొబైల్ వినియోగదారులపై కాల్ ఛార్జీల భారం !
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2019 | 5:39 PM

మొబైల్ వినియోగదారులకు షాకింగ్  న్యూస్..! ఇక మీ మొబైల్ బిల్లు సాగి బారెడు కాబోతుంది..! అవును.. కాల్ ఛార్జీలకు రెక్కలు రానున్నాయి. మరో రెండు మూడు రోజుల్లోనే వినియోగదారులపై కాల్ ఛార్జీల భారం పడనుంది. డిసెంబర్ నెల నుంచే టారిఫ్ లు పెంచేందుకు ఎయిర్ టెల్, రిలయెన్స్, జియో, వోడాఫోన్, ఐడియా, బీఎస్ ఎన్ ఎల్ లు భారీగా ధరలు పెంచేందుకు సిద్దంగా ఉన్నాయి. పెరిగిన ధరలతో కస్టమర్స్ జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు కారణం..టెలికాం, ట్రాయ్ విభాగాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటమే అంటున్నారు విశ్లేషకులు. దీంతో ఇక టారీఫ్ పెంపు అనివార్యమని టెలికాం కంపెనీలు స్పష్టం చేశాయి.  టారిఫ్ లపై ఎలాంటి చర్చలు ఉండవని, మున్ముందు కూడా ఛార్జీలు పెరుగుతాయిని టెలికాం వర్గాలు స్పష్టం చేశాయి. టెలికాం కంపెనీలో టారిఫ్ ల పెంపులో తాము జోక్యం చేసుకోబోమని కొందరు అధికారులు సైతం ప్రకటించారు. కాల్ ఛార్జీలు అమల్లోకి వచ్చాక.. యూజర్ నుంచి వచ్చే రెస్పాండ్ ఎలా ఉంటుందో వేచి చూస్తామని, ఏఆర్ పీ యూలు తగిన స్థాయిలో ఉంటే ఫ్లోర్ ప్రైసింగ్ అవసరం లేదని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ వెల్లడించారు. అయితే, దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో యూజర్లు కలిగిన జియో సంస్థ కాల్ ఛార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరీ..