YS Sharmila: దేశం పట్టం కడుతుందని పగటి కలలు కంటున్నారా? కేసీఆర్‌ జాతీయ పార్టీపై షర్మిల సెటైర్లు

తెలంగాణ ప్రజల తరుఫున పోరాడుతున్న ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్సార్‌టీపీ మాత్రమే. మాట మీద నిలబడే నాయకత్వం కోసం, మళ్లీ వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకురావడం కోసం మా పార్టీ పని చేస్తుంది' అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు షర్మిల.

YS Sharmila: దేశం పట్టం కడుతుందని పగటి కలలు కంటున్నారా? కేసీఆర్‌ జాతీయ పార్టీపై షర్మిల సెటైర్లు
Ys.sharmila
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 06, 2022 | 11:01 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశం తనకు పట్టం కడుతుందనే భ్రమలో కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారంటూ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని పట్టం కడితే.. ఉన్నది తిన్నవ్.. తెచ్చినది తిన్నవ్. బంగారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావ్. రైతులు, నిరుద్యోగులు సచ్చేలా చేశావ్. వ్యతిరేకతను దాచిపెడుతూ.. తోడు దొంగలను కలుపుకొని.. దేశం నాకు పట్టం కడుతుందని.. పగటి కలలు కంటున్నావ్‌. దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటున్నారు. స్వలాభం, స్వార్థం కోసం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌ గారు.. గూట్లో రాయి తీయడమే చేతకాని మీరు, ఏట్లో రాయి తీస్తారా? ఇక్కడ పరిపాలనే చేతకాని మీరు దేశాన్ని ఉద్దరిస్తారా? రాష్ట్ర ప్రజలను పట్టించుకోని మీకు దేశం ఎలా పట్టం కడుతుంది కేసీఆర్‌ గారు. ఆశకు హద్దు లేదు .. మీ ఆలోచనకు అవకాశం కూడా లేదు.

‘ ఈరోజు మూడు జాతీయ పార్టీలన్నీ ఒక వైపు.. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఇంకో వైపు. తెలంగాణ ప్రజల తరుఫున పోరాడుతున్న ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్సార్‌టీపీ మాత్రమే. మాట మీద నిలబడే నాయకత్వం కోసం, మళ్లీ వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకురావడం కోసం మా పార్టీ పని చేస్తుంది’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు షర్మిల. కాగా నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేస్తున్న షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై, కేసీఆర్ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్‌ జాతీయ పార్టీపై కూడా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో గుడులు, బడులు కంటే ఎక్కువగా బార్లు, వైన్ లు, బెల్ట్ షాపులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..