YSRTP Deeksha: వనపర్తి జిల్లాలో వైఎస్సార్‌టీపీ నిరుద్యోగ దీక్ష.. ఉద్యోగాల భర్తీ పూర్తి చేసే వరకు పోరాటంః షర్మిల

తెలంగాణ పాలకులపై మరోసారి మండిపడ్డారు YSRTP అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా ఉంటానన్న ఆమె.. ఉద్యోగాల భర్తీ కోసం పోరాటం చేస్తానన్నారు.

YSRTP Deeksha: వనపర్తి జిల్లాలో వైఎస్సార్‌టీపీ నిరుద్యోగ దీక్ష.. ఉద్యోగాల భర్తీ పూర్తి చేసే వరకు పోరాటంః షర్మిల
Ys Sharmila Participate Ysrtp Unemployment Strike
Follow us

|

Updated on: Jul 13, 2021 | 8:10 PM

YSRTP Unemployment Strike in Wanaparthy: తెలంగాణ పాలకులపై మరోసారి మండిపడ్డారు YSRTP అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా ఉంటానన్న ఆమె.. ఉద్యోగాల భర్తీ కోసం పోరాటం చేస్తానన్నారు. మంగళవారాన్ని నిరుద్యోగదినంగా ప్రకటించి.. ఇందులో భాగంగా ఇవాళ వనపర్తి జిల్లాలో నిరాహారదీక్ష చేపట్టారు.

తెలంగాణలో నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరాహరదీక్ష చేపట్టారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు నిరాహారదీక్ష కొనసాగించారు. దీక్షలో కూర్చునే ముందు నిరుద్యోగ సమస్యతో ప్రాణాలు తీసుకున్న కొండల్‌ ఇంటికి వెళ్లి…తల్లిదండ్రుల్ని పరామర్శించారు షర్మిల. వారికి తన సానుభూతి ప్రకటించారు.

కొండల్ ఇంటి నుంచి వైఎస్ షర్మిల దీక్షాస్థలికి చేరుకున్నారు. నిరాహారదీక్షకు పెద్ద సంఖ్యలో వైఎస్‌ఆర్‌ అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో కదలివచ్చారు. దీక్షకు మద్దతు తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వ వైఖరీని తప్పు పట్టారు వైఎస్ షర్మిల. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. నోటిఫికేషన్లు అంటూ ప్రకటనలకే పరిమితమయ్యారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 వేల మందిని ఉద్యోగాల్లోంచి పీకేశారని షర్మిల ఆరోపించారు.

రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా చేయాలన్నదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాటం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ దినంగా పాటిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ వనపర్తిలో నిరాహారదీక్ష చేపట్టిన షర్మిల.. నిరుద్యోగత యువతకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. YSRTP అధికారంలోకి వస్తే విభజించిన కొత్త జిల్లాల ప్రతిపాదికన ఉద్యోగ నియామకాలు చేపడతామని మాటిచ్చారు.

Read Also…  TPCC కోసం 50కోట్లు ఇచ్చింది నిజం కాదా..?రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..:50 crores for TPCC Video.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు