YS Sharmila: తాను పెట్ట బోయే పార్టీకి కేంద్ర కార్యాలయం ఎక్కడ పెట్టాలి అనేదానిపై వైఎస్‌ షర్మిల సమాలోచనలు..!

YS Sharmila: తాను పెట్టబోయే పార్టీకి కేంద్ర కార్యాలయం ఎక్కడ పెట్టాలనే దానిపై వైఎస్‌ షర్మిల సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కలిసి..

YS Sharmila: తాను పెట్ట బోయే పార్టీకి కేంద్ర కార్యాలయం ఎక్కడ పెట్టాలి అనేదానిపై వైఎస్‌ షర్మిల సమాలోచనలు..!
ఇదిలా కొనసాగుతుండగానే ఏపీ సీఎం వైఎస్ జగన్ చెల్లెలు.. వైఎస్ షర్మిల చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. దీని కోసం ఎవరితోనైనా.. ఎంతటి వారితో అయినా.. పోరాటానికి సిద్ధమన్నారు షర్మిల.
Follow us

|

Updated on: Feb 11, 2021 | 10:14 AM

YS Sharmila: తాను పెట్టబోయే పార్టీకి కేంద్ర కార్యాలయం ఎక్కడ పెట్టాలనే దానిపై వైఎస్‌ షర్మిల సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కలిసి వచ్చిన లోటస్‌ పాండ్‌లోని తన ఇంట్లో నుంచే పార్టీ వ్యవహారాలు నడపాలని పలువరు నేతలు షర్మిలకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కార్యాలయం గచ్చిబౌలిలో అనువుగా ఉంటుందని అనుకున్న జిల్లా నేతలకు దూరం అవుతుందనే భావనలో షర్మిల ఉన్నట్లు సమాచారం. పార్టీ విధానాలు తయారు చేసేందుకు రాజకీయ మేధావులతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలోని పలువరు రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, అధికారులతో చర్చించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఎక్కడ వైఎస్‌ఆర్‌ సీపీ ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కాగా, తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ఇటీల ప్రకటించారు. అయితే వైఎస్సార్‌‌టీపీ పేరుతో పార్టీ పెట్టనున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు… కొత్త పార్టీతో ఎందుకు రాకూడదు.. అని వ్యాఖ్యానించిన షర్మిల దిశగానే అడుగులు ఉండబోతున్నాయని తేల్చేశారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

అనుకున్నట్టుగానే పార్టీ దిశగా షర్మిల అడుగులేస్తున్నారు. వైసీపీకి ఆంధ్ర ముద్ర ఉన్నందునే కొత్త పార్టీ పేరుతో తెలంగాణలోకి వెళ్లాలని భావిస్తున్నాట్టు సన్నిహితుల సమాచారం. వైఎస్‌ఆర్‌, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరు డిసైడ్ చేయనున్నారు. రానున్న 30 రోజుల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. తర్వాత పార్టీ ప్రకటన చేయనున్నారు. దీని కోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే 100 నియోజకవర్గాల్లో 16నెలల పాటు షర్మిల పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. ఆమె వైఎస్‌ఆర్‌ అభిమానులతో ఏకంగా 30 రోజులు భేటీ కానున్నారు.

Also Read: YS Sharmila : షర్మిల కొత్త పార్టీపై క్రిస్టల్ క్లియర్‌.. తెలంగాణలో “రాజన్న రాజ్యం” టీవీ9తో ఫస్ట్ రియాక్షన్..