ప్రేమ పేరుతో మ్యూజిక్ టీచర్‌ను మోసం చేసిన కామాంధుడు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో..

ప్రేమ పేరుతో నిత్యం ఎక్కడో ఓ చోట యువతులు నయవంచనకు గురవుతూనే ఉన్నారు. చట్టాలు, శిక్షలు ఎన్ని వచ్చినా వారిపై అఘాయిత్యాలు

  • uppula Raju
  • Publish Date - 1:14 pm, Wed, 30 December 20
ప్రేమ పేరుతో మ్యూజిక్ టీచర్‌ను మోసం చేసిన కామాంధుడు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో..

ప్రేమ పేరుతో నిత్యం ఎక్కడో ఓ చోట యువతులు నయవంచనకు గురవుతూనే ఉన్నారు. చట్టాలు, శిక్షలు ఎన్ని వచ్చినా వారిపై అఘాయిత్యాలు, మోసాలు ఆగడం లేదు. పాఠశాలల్లో, కాలేజీల్లో, కార్యాలయాల్లో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కాలం అప్‌డేట్ అయినా మనుషులు అప్‌డేట్ కావడం లేదు. సోషల్ మీడియా కేంద్రంగా రోజు ఎందరో అభాగ్యులు మోసాలకు గురవుతున్నారు. ఐదేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల ముదుసలి వరకు లైంగిక దాడికి గురవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా మహిళలు,యువతులు, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాజాగా బంజారాహిల్స్‌లో ఓ మ్యూజిక్ టీచర్‌ను ప్రేమ పేరుతో మభ్యపెట్టి మోసం చేశాడు ఓ కామాంధుడు. అమాయకురాలైన అమ్మాయి నమ్మివస్తే అవసరం తీరాక మొహం చాటేస్తున్నాడు. కరన్ కాన్సెప్ట్‌కు చెందిన చెరుకు కరణ్ రెడ్డి అనే వ్యక్తి కొంతకాలంగా ఓ మ్యూజిక్ టీచర్‌పై కన్నేసి అవసరం తీరిపోయాక తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలు నిలదీయడంతో అసలు వ్యవహారం బయటికి వచ్చింది. దీంతో స్పందించిన ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.