Telangana: పెద్దల సూక్తిని నిజం చేసిన యువకుడు.. వంటల మాస్టారు కాస్తా ఆటల మాస్టారుగా..!

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు.. మన పెద్దలు.. ఈ సూక్తిని ఓ యువకుడు నిజం చేశాడు. లక్ష్యం చేరుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా చలించలేదు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ఏ పని చేసినా.. లక్ష్యంపై పట్టు సడలకుండా యత్నించి విజయవంతమయ్యాడు.

Telangana: పెద్దల సూక్తిని నిజం చేసిన యువకుడు.. వంటల మాస్టారు కాస్తా ఆటల మాస్టారుగా..!
Sports Master
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 22, 2024 | 5:59 PM

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు.. మన పెద్దలు.. ఈ సూక్తిని ఓ యువకుడు నిజం చేశాడు. లక్ష్యం చేరుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా చలించలేదు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ఏ పని చేసినా.. లక్ష్యంపై పట్టు సడలకుండా యత్నించి విజయవంతమయ్యాడు. కుటుంబ పోషణ కోసం వంటల మాస్టారుగా పనిచేసి.. నేడు ఆటల మాష్టారయ్యాడు. ఆ ఆటల మాష్టారు ఎవరో తెలుసు కోవాలంటే..ఈ స్టోరీ చదవాల్సిందే..!

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం వెంకేపల్లి గ్రామానికి చెందిన శనిగల శ్రీనివాస్‌ ది.. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలీనాలితో ఉన్నత విద్యబుద్ధులు నేర్పించారు. వారి ప్రోత్సాహంతో డిగ్రీ 2003లో, బీఈడీ 2006లో సూర్యాపేటలో పూర్తి చేశాడు. 2013లోసిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీపీడీ చదివాడు. శ్రీనివాస్‌కు భార్య రాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారింది. 2006, 2008, 2012, 2017లో నాలుగు పర్యాయాలు ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (డీఎస్సీ)లో పాల్గొన్నా ఎంపిక కాలేదు. దీంతో ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడిగా, ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌, వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో కుటుంబం గడవటం కష్టంగా మారింది. సరదాగా చేసిన వంట కుటుంబానికి జీవనాధారంగా మారింది. ఐదేళ్లుగా గ్రామ చుట్టుపక్కల శుభకార్యాలకు వంటలు చేస్తూ వంట మాస్టారుగా మంచి పేరుతెచ్చుకున్నాడు.

ఓ వైపు వంట మాస్టారుగా పని చేస్తూనే.. మరో వైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. 2017లో గురుకుల పీఈటీ ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించగా ప్రతిభ చాటాడు. కోర్టు కేసులతో నిలిచిపోయిన నియామక ప్రక్రియ నాలుగు రోజుల క్రితం రెండో జాబితాను వెల్లడించారు. ఇందులో అర్హత సాధించిన శ్రీనివాస్, వంట మాస్టారు కాస్తా ఆటల మాస్టారు ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు.

ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగం రాక చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే పొరుగువారు అవహేళన చేసేవారని, అయినా బాధ పడకుండా లక్ష్యం కోసం దీక్షతో ముందుకు సాగితే అది మనకు చేరువ అవుతుందని శ్రీనివాస్‌ వివరించారు. శ్రీనివాస్‌.. నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలిచాడని చెప్పవచ్చు..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..