Telangana: గర్భిణి ఉసురు తీసిన అదనపు కట్నం.. బలవంతంగా యాసిడ్, విషం తాగించి దారుణం

కట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరం.. అని ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కట్నం ఇచ్చిపుచ్చుకునే దురాచారం సమాజంలో ఒక జబ్బుగా మారింది. కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేక చిన్నారులను....

Telangana: గర్భిణి ఉసురు తీసిన అదనపు కట్నం.. బలవంతంగా యాసిడ్, విషం తాగించి దారుణం
Chennai Murder
Follow us

|

Updated on: Apr 28, 2022 | 10:32 AM

కట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరం.. అని ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కట్నం ఇచ్చిపుచ్చుకునే దురాచారం సమాజంలో ఒక జబ్బుగా మారింది. కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేక చిన్నారులను హత్య చేసే ఘటనలు మనం ఎన్నో చూశాం. అంతే కాదు.. అడిగినంత కట్నం ఇచ్చి, ఘనంగా అత్తారింటికి పంపే తల్లిదండ్రులనూ చూశాం. మరోవైపు.. అదనపు కట్నం కోసం అత్తింట్లో వేధింపులు మహిళలు నిత్యనరకంగా మారుతున్నాయి. వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటుండగా మరికొందరు హత్యలకు గురవుతున్నారు. తాజాగా తెలంగాణలో ఇలాంటి ఉదంతమే జరిగింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వివాహితకు బలవంతంగా విషం, యాసిడ్ తాగించారు. నిజామాబాద్‌ జిల్లాలోని మల్కాపూర్ కు చెందిన కల్యాణికి.. వర్ని మండలం రాజ్ పేట్‌ తండావాసి తరుణ్ తో వివాహైంది. కొన్నాళ్లు బాగానే ఉన్న సమయంలో ఆమె గర్భం దాల్చింది. తర్వాత కొంత కాలానికి వీరి కాపురంలో అదనపు కట్నం చిచ్చు రేపింది. ఇంకా కట్నం తీసుకురావాలంటూ భర్తతో పాటు అత్తింటివారు వేధింపులకు పాల్పడేవారు. శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించేవారు.

ఆమెను వదిలించుకోవాలనేందుకు హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. కల్యాణిని హతమార్చేందుకు పన్నాగం పన్నారు. భర్తతో పాటు మామ ఫకీరా, సమీప బంధువు ప్రవీణ్‌.. బాధితురాలికి బలవంతంగా విషం, యాసిడ్‌ తాగించారు. తీవ్ర భయాందోళనకు గురైన కల్యాణి కేకలు విని పక్కింట్లో ఉంటున్న ఆమె అక్క శోభ వచ్చింది. అప్పటికే కల్యాణి కిందపడిపోయి నురగలు కక్కుతూ కనిపించింది. వెంటనే అప్రమత్తమై స్థానికుల సహాయంతో నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కల్యాణి బుధవారం మృతి చెందింది.

మరిన్నిక్రైమ్ వార్తలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Samantha: జెస్సీ నుంచి యశోద వరకు.. తెలుగు ప్రేక్షకుల మనసులో లేడీ సూపర్ స్టార్.. సమంత బర్త్ డే స్పెషల్..

Telangana: మానవత్వం మరిచిన అద్దె ఇంటి యజమాని.. కొన ఊపిరితో ఉన్నాడన్న కనికరం లేకుండా

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..