కులం వెలి.. మహిళ ఆత్మహత్యాయత్నం..!

ఆధునిక సమాజంలో ఉండి, కంప్యూటర్‌లతో పోటీ పడే కాలంలో సైతం కూడా మూఢాచారాలు కొనసాగుతున్నాయి. కొన్ని తండాల్లో ఇప్పటికీ గ్రామ బహిష్కరణ, సాంఘీక కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. ఇలాంటిదే ఓ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తగూడెంలో జరిగింది. ఓ కుటుంబాన్ని ఆ గ్రామ పెద్దలు 3 సంవత్సరాలు బహిష్కరించారు. దీంతో మనస్థాపానికి గురైన బాధిత కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ధనుంజయ, పద్మ దంపతుల కుమారుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ […]

కులం వెలి.. మహిళ ఆత్మహత్యాయత్నం..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 20, 2019 | 6:08 PM

ఆధునిక సమాజంలో ఉండి, కంప్యూటర్‌లతో పోటీ పడే కాలంలో సైతం కూడా మూఢాచారాలు కొనసాగుతున్నాయి. కొన్ని తండాల్లో ఇప్పటికీ గ్రామ బహిష్కరణ, సాంఘీక కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. ఇలాంటిదే ఓ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తగూడెంలో జరిగింది. ఓ కుటుంబాన్ని ఆ గ్రామ పెద్దలు 3 సంవత్సరాలు బహిష్కరించారు. దీంతో మనస్థాపానికి గురైన బాధిత కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ధనుంజయ, పద్మ దంపతుల కుమారుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని రోజులకు మనస్పర్థల కారణంగా ఆ యువతి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అనంతరం అతను మోసం చేసి లోబరుచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. అతడిని జైలుకు పంపారు పోలీసులు.

అనంతరం గ్రామానికి వచ్చిన అతనికి గ్రామ పెద్ద మనుషులు.. పంచాయితీ నిర్వహించి 4 లక్షల రూపాయలు జరిమానా విధించారు. అయితే.. మేం జైలు శిక్ష కూడా అనుభవించాము.. ఇప్పుడు మళ్లీ డబ్బులెందుకు కట్టాలని అడిగినందుకు మూడు సంవత్సరాల పాటు గ్రామ బహిష్కరణ విధిస్తున్నట్టు తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన పద్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే బాధితురాలిని మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..