Tiger: పులి పంజా దెబ్బకు అడవి విల విల.. తెలంగాణ-మహారాష్ర్ట బోర్డర్‌లో టెన్షన్‌.. తాడోబా ఫారెస్టులో టెరిటోరియల్ ఫైట్..

తడోబా అభయారణ్యంలో కలకలం రేపుతున్న వరుస పులుల మరణాలు. రెండు రోజుల వ్యవధిలో ఆరు పులులు మృతి... వీటి మరణాల వెనుక కారణం ఏమిటి? వేటగాళ్ళపనా ? లేక టెరిటోరియల్ ఫైటా..?

Tiger: పులి పంజా దెబ్బకు అడవి విల విల.. తెలంగాణ-మహారాష్ర్ట బోర్డర్‌లో టెన్షన్‌.. తాడోబా ఫారెస్టులో టెరిటోరియల్ ఫైట్..
Tiger
Follow us

|

Updated on: Dec 04, 2022 | 9:57 AM

బెబ్బులి దడ పుట్టిస్తోంది. తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్‌లో మ్యాన్‌ఈటర్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కనిపించిన పశువులు, మనుషులపై పంజా విసురుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌జిల్లా తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పెద్దపులి తిష్టవేసింది. రక్తానికి రుచిమరిగిన బెబ్బులి కనిపించిన జంతువులపై దాడి చేస్తోంది. చివరకు తన జాతికి చెందిన పులులపై కూడా దాడిచేసి చంపేయ్యడం అటవీశాఖ అధికారులనే కలవరపరుస్తోంది. పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లిన జంగు అనే వ్యక్తి పీక కొరికి చంపేసింది. పులి పంజా దెబ్బకు శరీరం నుంచి తల వేరు అయింది. మరోవైపు షేయోని ఫారెస్ట్ రేంజ్‌లో ఓ తల్లి పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని 3 రోజలు కూడా కాకముందే మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని తాడోబ టైగర్ రిజర్వు పారెస్ట్‌లో నాలుగు పులి పిల్లలు చనిపోయి కనిపించాయి. మరణించిన పులి పిల్లల వయసు 3-4 ఏళ్ల మధ్య ఉందన్నారు ఫారెస్టు ఆఫీసర్స్‌. తల్లి పులి కళేబరం కనిపించిన ప్రాంతంలోనే ఇవి కూడా కనిపించినట్టు తాడోబా-అంధారి టైగర్ రిజర్వు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

చనిపోయిన పులి పిల్లల్లో రెండు మగవి కాగా, మిగతా రెండు ఆడవి. చనిపోయిన నాలుగు పులి పిల్లలపై కొరికిన గాయాలు ఉన్నాయని, దీనిని బట్టి చూస్తే ఆ మగ పులే వాటిని చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. పులి పిల్లల కళేబరాలను పోస్టుమార్టం కోసం చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కి తరలించారు.

బెబ్బులి భయంతో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భయాందోళనలు నెలకొన్నాయి. తాడోబ ఫారెస్టులో టెరిటోరియల్‌ ఫైట్‌ నడుస్తోంది. పశువులు, మనుషులపై దాడితో లక్కాడికోట్‌, వాంకిడి ప్రజలు వణికిపోతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఆరు పులులు, ఓ వ్యక్తిని పొట్టన పెట్టుకున్న మ్యాన్‌ఈటర్‌ను పట్టుకునేందుకు ఫారెస్టు సిబ్బంది ట్రాప్‌ కెమెరాలు, టైగర్‌ ట్రాకర్లతో పులివేట కొనసాగుతోంది. ఐతే మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాలో ఉన్న కవ్వాల్‌ అటవీప్రాంతంలోకి మ్యాన్‌ఈటర్‌ ఎంటరయ్యే అవకాశం అవకాశం ఉంది.

అయితే..మనిషి రక్తం మరిగిన పులి ఎక్కడో అక్కడ మళ్లీ మనిషిపై దాడి చేసే అవకాశం ఉందని, అందుకే శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా