Telangana Weather: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆదివారం వరకు దంచుడే

తెలంగాణలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Telangana Weather: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆదివారం వరకు దంచుడే
Rain Alert
Ram Naramaneni

|

Jun 07, 2022 | 9:12 PM

తెలంగాణలో వేసవి తాపం నుంచి ప్రజలకు రిలీఫ్ దక్కనుంది. భానుడు శాంతించనున్నాడు. వరుణుడు డ్యూటీ షురూ చేయనున్నాడు.  రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. మంగళవారం ఉపరితల ద్రోణి తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి.. విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ(Rayalaseema) వరకు.. సగటు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తున ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.  గురు, శుక్రవారాలో, తిరిగి ఆదివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.   ఆ సమయంలోనే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల(southwest monsoon) ఆగమనం కూడా ఉండనుంది.  సోమవారం నుంచి వాతావరణంలో చాలా మార్పు వచ్చిందని, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని  వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న వివరించారు. రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాల్లో కదలికలు భారీగా ఉండవచ్చని, వీటి ఎఫెక్ట్‌తో ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక(Karnataka), రాయలసీమ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నారు.వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu