Weather Forecast: ఆ జిల్లాల్లో వానలే వానలు.. వడగండ్లు పడే ఛాన్స్.. రాబోయే 3 రోజుల జరభద్రం!
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్ల వాన కడగండ్లు మిగులుస్తోంది. అయితే రానున్న మూడు రోజుల కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ.. ఆయా జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్ల వాన కడగండ్లు మిగులుస్తోంది. అయితే రానున్న మూడు రోజుల కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ.. ఆయా జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఇక శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయన్నారు.
అటు ఏప్రిల్ 9వ తేదీన మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడతాయని తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అన్నారు. 10వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.




మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..