Telangana: ఆఫర్‌లో ఐఫోన్ 4 వేలకు వస్తుందని ఆర్డర్ పెట్టాడు.. తీరా పార్శిల్ వచ్చాక విప్పి చూస్తే…

ఆశ ఉండటంతో తప్పు లేదు. అత్యాశ ఉంటేనే డేంజర్. ఆఫర్ అదిరింది వెంటనే కమిట్ అయిపోతే అడ్డంగా బుక్ అయిపోవాల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలో వెలుగుచూసింది.

Telangana: ఆఫర్‌లో ఐఫోన్ 4 వేలకు వస్తుందని ఆర్డర్ పెట్టాడు.. తీరా పార్శిల్ వచ్చాక విప్పి చూస్తే...
Fraud
Follow us

|

Updated on: Aug 03, 2022 | 5:35 PM

Crime News: ఫోన్‌కి వచ్చే ప్రతి లింక్ నొక్కొద్దని  రెగ్యూలర్‌గా నిపుణులు చెబుతూనే ఉన్నారు. సిమ్ కంపెనీల వాళ్లు కూడా మెసేజీలు పంపూతూనే ఉన్నారు. టీవీల్లో మేము కూడా మొత్తుకుంటున్నాం. కానీ కొందరు మాత్రం మాట వినడం లేదు. ఆరాటంతో ఆ లింకులు ఓపెన్ చేసి.. స్కామ్ గాళ్ల వలల్లో చిక్కుంటున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా( kamareddy district) బీర్కూర్‌(Birkoor)లో అలాంటి ఘటనే వెలుగుచూసింది. రాంసాని శ్రీను అనే వ్యక్తికి గత నెల 28న ఓ మెసేజ్ వచ్చింది. అందులో ఓ లింక్ ఉంది. అసలు ఆ లింక్ ఏంటో తెలుసుకుందామని క్లిక్ చేశాడు. ఓపెన్ చేయగానే బూరెల బుట్టలో పడ్డట్లు.. దిమ్మతిరిగే ఆఫర్ కనిపించింది. దాదాపు 25 వేల ఖరీదు ఉన్న ఐఫోన్.. 4 వేలకే ఇస్తామన్నది ఆ ఆఫర్. ఇంతకంటే పెద్ద ఆఫర్ ఉంటుందా అని అతను సంబరపడ్డాడు. అది నిజమా అబద్ధమా అన్న విషయం గురించి పూర్తిగా ఆలోచించకుండా.. డబ్బు కట్టేసి ఫోన్ ఆర్డర్ పెట్టాడు. ఆగస్టు 2న ఫోన్ డెలివరీ అవుతుందని ఆర్డర్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అనుకున్న రోజు రానే వచ్చింది. ఇంటికి డెలివరీ బాయ్ వచ్చేశాడు. పార్శిల్ కూడా తెచ్చాడు. ఫోన్ చూడాలన్న తపనతో శ్రీను తహతహలాడిపోతున్నాడు. పార్శిల్ అందుకోగానే.. దాన్ని ఓపెన్ చేసి కంగుతిన్నాడు. అందులో ఫోన్ లేదు.. అన్నీ హిందీ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. వెంటనే బాధతో తన ఫ్రెండ్స్‌కు, తెలిసిన వారికి చెప్పి బోరుమన్నాడు. దీంతో వారు డెలవరీ బాయ్‌ను పట్టుకుని నిలదీశారు.

అతడు తనకేం తెలియదని.. కేవలం డెలివరీ మాత్రమే చేస్తామని.. ఏదైనా సమస్య ఉంటే సంస్థను సంప్రదించాలని కోరాడు. అతడు ఆ మాట అనడంతో గ్రామస్థులు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గద్దించారు. దీంతో లేనిపోని కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని ఆ డెలివరీ బాయ్ భయపడ్డాడు. బాధితుడి నుంచి కంపెనీకి లేఖ రాయించాడు. ఆపై నగదు ఇచ్చేశాడు.  శ్రీనుకు మనీ ఇవ్వడంతో డెలివరిబాయ్​ను స్థానికులు వదిలిపెట్టారు.

Cheating

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే