YS Sharmila : విద్య, వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం, పండిన పంట కొనుగోలు కోసం రోడ్డెక్కాలి : వైయస్ షర్మిల

ఇకపై ‘వైఎస్ఎస్ఆర్ టీమ్’ ఆపదలో మీకు ఉంటుంది. సాయం కావాల్సి వస్తే 040-48213268 ఫోన్ నెంబరుకు సమాచారం అందించండి..

YS Sharmila : విద్య, వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం, పండిన పంట కొనుగోలు కోసం రోడ్డెక్కాలి : వైయస్ షర్మిల
YS Sharmila
Follow us

|

Updated on: May 30, 2021 | 3:37 PM

YS Sharmila comments on KCR Government : తెలంగాణలో తాజాగా పొలిటికల్ అరంగేట్రం చేసిన వైయస్ షర్మిల మరోసారి కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రజలు పాట్లు పడుతున్నారని ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అటు, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంట్లో మగదిక్కును కోల్పోయిన మహిళలకు అండగా ఉండేందుకు షర్మిల చేపట్టిన “ఆపదలో తోడుగా YSSR” పథకంకు సంబంధించి చేస్తున్న సేవల్ని కూడా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. “విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడెక్కాలి.. కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల తరబడి పంట కొనుగోలు కేంద్రాల్లో.. వడ్లు వర్షం పాలైతున్నయి అని మొత్తుకుంటున్నా.. మీకు రైతు గోస కనుపడదు.. వినపడదు..” అంటూ వరి పండించిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరువు పెట్టారు షర్మిల. అంతేకాదు, “మేడ్చెల్ జిల్లా, బోడుప్పల్ కి చెందిన మంచాల సుధాకర్ కరోనాతో మృతి చెందారు. వారి కుటుంబానికి “ఆపదలో తోడుగా YSSR” టీమ్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందించినం. ఈ సహాయాన్ని వారి కాళ్ళ మీద వారు నిలబడటానికి ఉపయోగించుకొంటరని ఆశిస్తున్న.” అని సదరు ఆపన్న హస్తం అందించిన విషయాన్ని ట్వీట్ ద్వారా షర్మిల తెలియజేశారు.

“వరంగల్ రూరల్ జిల్లా, నర్సంపేట మండలం లకినేపల్లి గ్రామ నివాసి వంగ శ్రీనివాస్ కరోనాతో మృతి చెందారు. వారి కుటుంబానికి “ఆపదలో తోడుగా YSSR” టీమ్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందించినం. ఈ సహాయాన్ని వారి కాళ్ళ మీద వారు నిలబడటానికి ఉపయోగించుకొంటరని ఆశిస్తున్న.” అని వరంగల్ ఘటనకు సంబంధించిన సాయం వివరాల్ని షర్మిల పేర్కొన్నారు.

ఇలా ఉండగా, తెలంగాణలో కరోనా కాటుకు బలై ఇంట్లో పెద్దదిక్కు కోల్పోయిన మహిళలకు వైయస్ షర్మిల ఆసరా ఉండేందుకు నడుం బిగించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా జీవిత భాగస్వాములను, కన్నబిడ్డలను, అయినవారిని కోల్పోయిన మహిళలకు ఆసరాగా నిలుస్తానని షర్మిల ఇటీవల ప్రకటించారు. కరోనా మహమ్మారితో తమ కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచే ఎంతోమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల.. కుటుంబ పెద్ద దిక్కుగా నిలిచే వారిని కోల్పోయి నిరాశా నిస్పృహలతో కుంగిపోతున్న మహిళల బాధను కాస్తయినా పంచుకోవాలన్న ఉద్దేశంతో ‘వైఎస్ఎస్ఆర్ టీమ్’ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

తెలంగాణ ఆడబిడ్డలు ధైర్యం కోల్పోరాదని పిలుపునిచ్చిన ఆమె, “మీ కాళ్లపై మీరు నిలబడడానికి, మళ్లీ మీ జీవితం సాఫీగా సాగేందుకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంటున్నాను. మీరంతా మన వైఎస్సార్ కుటుంబ సభ్యులని భావిస్తున్నాను. ఇకపై ‘వైఎస్ఎస్ఆర్ టీమ్’ ఆపదలో మీకు ఉంటుంది. సాయం కావాల్సి వస్తే 040-48213268 ఫోన్ నెంబరుకు సమాచారం అందించండి” అని షర్మిల సూచించారు.

Read also : Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో కేబినెట్ భేటీ మీదే అందరి దృష్టి, ఎలాంటి నిర్ణయం వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..