Gaddar: వారితో నా ప్రాణాలకు ముప్పు ఉంది.. రక్షణ కల్పించండి.. పోలీసులకు గద్దర్‌ విజ్ఞప్తి

అన్యాక్రాంతమవుతోన్న బాలసాయిబాబా ట్రస్ట్‌ భూములను కాపాడాలని జనగామ కలెక్టర్‌ శివలింగయ్యకు మెమొరాండం ఇచ్చారు. బాలసాయిబాబా ట్రస్ట్‌ భూముల రక్షణ కోసం పోరాటం చేస్తోన్న తనపై శత్రువులు దాడికి యత్నిస్తున్నారని అంటున్నారు గద్దర్‌.

Gaddar: వారితో నా ప్రాణాలకు ముప్పు ఉంది.. రక్షణ కల్పించండి.. పోలీసులకు గద్దర్‌ విజ్ఞప్తి
Gaddar
Follow us

|

Updated on: Nov 20, 2022 | 6:40 AM

తన పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రజా గాయకుడు గద్దర్‌కి ప్రాణభయం వెంటాడుతోంది. ఇంతకీ, గద్దర్‌ను వెంటాడుతోన్న ఆ శత్రువులు ఎవరు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? తాజాగా తనకు ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండంటూ పోలీసులను ఆశ్రయించారు ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్. జనగామ జిల్లా కలెక్టర్‌ అండ్ డీసీపీని కలిసి వినతిపత్రం అందచేశారు. తనకు శత్రువులు ఉన్నారని, వాళ్ల నుంచి భద్రత కల్పించాలంటూ డీసీపీ సీతారామ్‌ను కోరారు. అలాగే, అన్యాక్రాంతమవుతోన్న బాలసాయిబాబా ట్రస్ట్‌ భూములను కాపాడాలని జనగామ కలెక్టర్‌ శివలింగయ్యకు మెమొరాండం ఇచ్చారు. బాలసాయిబాబా ట్రస్ట్‌ భూముల రక్షణ కోసం పోరాటం చేస్తోన్న తనపై శత్రువులు దాడికి యత్నిస్తున్నారని అంటున్నారు గద్దర్‌. అందుకే, కలెక్టర్‌ను డీసీపీని కలిసి భద్రత కల్పించాలని వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. రఘునాథపల్లి మండలం మండలగూడెంలో బాలసాయిబాబా ట్రస్ట్‌ భూములపై న్యాయ పోరాటం చేస్తున్నారు గద్దర్‌. పేదలకు దక్కాల్సిన ఆ భూములను కొందరు పెద్దలు లాక్కురని ఆరోపిస్తున్నారు. బాలసాయిబాబా ట్రస్ట్‌ ల్యాండ్స్‌పై తన పోరాటం ఆగదంటోన్న గద్దర్‌, మొత్తం 59 ఎకరాల భూములను పేదలకు పంచేవరకు వదిలే ప్రసక్తే లేదంటున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల బాల సాయిబాబా కుటుంబ సభ్యులు సదరు భూములను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి అమ్మినట్లు తెలుస్తుంది. ఈ భూముల విషయమై మూడు రోజుల క్రితం గద్ద రఘునాథపల్లి రెవెన్యూ అధికారులను కలిశారు. సమాచార హక్కు చట్టం ద్వారా భూముల వివరాలను ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ఏదేమైనా గద్దర్ రెండు రోజులుగా జనగామ జిల్లాలో తిరుగుతుండడం, జిల్లా ఉన్నతాధికారులను కలవడం సర్వత్రా చర్చానీయంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..