Congress Leader: ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నా ఓబీసీ లకు ఒరిగిందేం లేదు.. వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు..

Congress Leader: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీగా ఉన్న దేశంలో ఓబీసీలకు న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు..

Congress Leader: ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నా ఓబీసీ లకు ఒరిగిందేం లేదు.. వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 2:47 PM

Congress Leader: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీగా ఉన్న దేశంలో ఓబీసీలకు న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీలకు ఒక్కరికి మాత్రమే క్రిమిలేయర్ ఏంటి? అని ప్రశ్నించారు. క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించారే కానీ.. అందులో పది శాతం కూడా అమలు కావడం లేదని అన్నారు.

ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా వీహెచ్ కామెంట్స్ చేశారు. కేవలం ఆత్మగౌరవ భవనాలే కాదని, తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని అన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు కనీస గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు. వచ్చే ఏప్రిల్‌కు జాతీయ జెండా ఆవిష్కరించి వందేళ్లు అవుతాయన్న ఆయన.. ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతీ గ్రామానికి జాతీయ జెండా నినాదాన్ని తీసుకెళ్లి.. ప్రజల్లో దేశభక్తిని నింపుతానని అన్నారు.

Also read:

ఎన్నికల కమిషనర్‌కు ఉద్యోగులు సహకరించరని పెద్దిరెడ్డి మాట్లాడ్డం రాజ్యాంగ విరుద్ధం: అచ్చెన్నాయుడు

ఏపీ లోకల్ ‘పంచాయితీ’: ఎస్ఈసీ, జడ్జిలకు కులం అంటగట్టవద్దు… స్థానిక సంస్థల ఎన్నికలు జరిపాలన్న పవన్ కళ్యాణ్