Kishan Reddy: అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ అబద్ధాలు.. ఆ విషయాలు ఎందుకు చెప్పలేకపోయారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన ప్రసంగంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులతో చేపట్టిన కార్యక్రమాలను సైతం తమ ఖాతాలో...

Kishan Reddy: అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ అబద్ధాలు.. ఆ విషయాలు ఎందుకు చెప్పలేకపోయారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్..
Central Minister Kishan Reddy
Follow us

|

Updated on: Feb 03, 2023 | 8:35 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన ప్రసంగంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులతో చేపట్టిన కార్యక్రమాలను సైతం తమ ఖాతాలో వేసుకొని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారాయని గవర్నర్​తో చదివించిన రాష్ట్ర ప్రభుత్వం.. బిల్లులందక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని ఎందుకు చెప్పించలేకపోయిందని ప్రశ్నించారు. ప్రభుత్వ కృషితో రాష్ట్ర ఆదాయం పెరిగిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. 16 వేల మిగులు బడ్జెట్​ఉన్న రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆక్షేపించారు.

వ్యవసాయ సబ్సిడీలు, పథకాలన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. రైతు బంధు ఇస్తున్నా వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో సమాధానం లేదు. ధరణి పేరుతో రైతుల్ని దగా చేస్తుంటే తప్పులు సవరణపై స్పందించే నాధుడే లేడు. కేంద్రం నిధులతో నడుస్తున్న బస్తీ దవాఖానాలను తమ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. ఏడాది లోపు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసి దాని చుట్టూ వివాదాలను సృష్టిస్తోంది. ఉద్యోగ కల్పనపై అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్టీపీసీ ద్వారా జరుగుతున్న విద్యుదుత్పత్తిని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం హేయమైన చర్య. ఇకనైనా అబద్ధాలను ప్రచారం చేయడం మాని రాష్ట్ర సంక్షేమంపై దృష్టిపెట్టాలి.

  – కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. సంక్షేమ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరసలో ఉందని.. తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశామని, రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్న గవర్నర్.. ప్రభుత్వ కృషి వల్ల 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు