TSRTC: బస్సు ఛార్జీలు పెంచాలంటూ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు TSRTC రిక్వెస్ట్…

తెలంగాణలో బస్సు ఛార్జీల పెంచడంతో పాసింజర్స్ ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలను కూడా ఛార్జీలు పెంచాలని కోరింది TSRTC.

TSRTC: బస్సు ఛార్జీలు పెంచాలంటూ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు TSRTC రిక్వెస్ట్...
Tsrtc
Follow us

|

Updated on: Jun 15, 2022 | 7:59 AM

Telangana: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు ఇటీవల పెరిగిన విషయం తెలిసిందే.  డీజిల్ సెస్ పేరుతో, రౌండప్ చార్జీల పేరుతో ఇప్పుటికే పలుమార్లు ప్రయాణీకులపై భారం మోపింది TSRTC. దీంతో సామాన్యులు.. లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలోనే కాస్త ఛార్జీలు తక్కువ ఉంటాయని ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో.. ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్‌ ఆర్టీసీ సర్క్యులర్‌ జారీ చేసింది. అంతర్‌రాష్ట్ర రవాణా సంస్థల అగ్రిమెంట్ ప్రకారం.. ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే రూల్ ఉందని TSRTC అధికారులు తెలిపారు.  అందులో భాగంగానే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలకు సర్క్యులర్‌ జారీ చేసింది. టికెట్‌ ధర తక్కువ ఉండటంతో పాసింజర్స్ ఇతర రాష్ట్రాల బస్సులను ఎక్కువగా ప్రిఫర్  చేస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ దృష్టికి వచ్చింది. దీంతో సర్క్యులర్‌ పంపించినట్టు తెలుస్తోంది.

ప్రధానంగా ఏపీ నుంచి తెలంగాణకు జనం రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆ రాష్ట్ర బస్సులే ఎక్కువగా ఎక్కుతున్నారు ప్రయాణీకులు. దీంతో APSRTCకి సైతం సర్క్యూలర్‌ పంపించారు. ప్రభుత్వంలో ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనం కావడంతో తెలంగాణ ప్రాంతంలో తిరిగే ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల ఛార్జీల పెంపుపై ఇప్పుడే నిర్ణయం ఇప్పుడే తీసుకోలేమని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..