VC Sajjanar: టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు తప్పిన పెను ప్రమాదం.. మహారాష్ట్ర వెళ్తుండగా..

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు పెను ప్రమాదం త‌ప్పింది. సజ్జనార్‌ ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. దీంతో సజ్జనార్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

VC Sajjanar: టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు తప్పిన పెను ప్రమాదం.. మహారాష్ట్ర వెళ్తుండగా..
Sajjanar
Follow us

|

Updated on: Oct 02, 2022 | 6:49 AM

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు పెను ప్రమాదం త‌ప్పింది. సజ్జనార్‌ ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. దీంతో సజ్జనార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహారాష్ట్రకు వెళుతుండగా ధర్మారం క్రాస్ రోడ్ వద్ద రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా రాజీవ్ రహదారి పైకి అడ్డంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఆటో సజ్జనార్‌ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో రామగుండం మండలం మల్యాలపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మిలకు తీవ్ర గాయాలు కాగా అంతర్గాం మండలం రాయబండి గ్రామానికి చెందిన నూనె భూమయ్య, లక్ష్మికు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంట‌నే పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కరీంనగర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

కాగా.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుడి చేతి వేలుకు గాయమైనట్టు తెలుస్తోంది. ఆటో డ్రైవర్ తాగి వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!