రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న పువ్వాడ అజయ్‌.. ఖమ్మంలో బైక్‌ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రవాణాశాాఖ మంత్రి

రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ఖమ్మం నగరం పెవిలియన్ మైదానం నుంచి జడ్పీ సెంటర్, తెలంగాణ తల్లి సర్కిల్ మీదగా రవాణా శాఖ కార్యాలయం వరకు..

  • K Sammaiah
  • Publish Date - 1:23 pm, Sat, 23 January 21
రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న పువ్వాడ అజయ్‌.. ఖమ్మంలో బైక్‌ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రవాణాశాాఖ మంత్రి

తెలంగాణ వాప్తంగా 32వ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు రోడ్డు భద్రతపట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ఖమ్మం నగరం పెవిలియన్ మైదానం నుంచి జడ్పీ సెంటర్, తెలంగాణ తల్లి సర్కిల్ మీదగా రవాణా శాఖ కార్యాలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

జిల్లా రవాణా అధికారి కిషన్ రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమీషనర్ తఫ్సిర్ ఇబ్బల్, ఎంవీఐ లు, కార్పొరేటర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.