Telangana: బదిలీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ విషయాన్ని పరిగణలోని తీసుకోవాలని.

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. 317 జీఓ కింద వేరే జిల్లాకు..

Telangana: బదిలీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ విషయాన్ని పరిగణలోని తీసుకోవాలని.
Teachers Transfer
Follow us

|

Updated on: Feb 07, 2023 | 6:19 PM

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. 317 జీఓ కింద వేరే జిల్లాకు బదిలీ అయిన టీచర్ల పూర్వజిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. జనవరి 27వ తేదీన మొదలైన ఈ ప్రక్రియ మొత్తం 37 రోజుల పాటు సాగతనుంది. ఆ తర్వాత మళ్లీ 15 రోజులు అప్పీళ్లకు అవకాశం కల్పించనున్నారు. జీబీ317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 12తేది నుంచి 14వ తేది వరకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు 59వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు మంత్రి తెలిపారు.

37 రోజుల పాటు సాగనున్న ఈ ప్రక్రియ జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అన్ని కేటగిరీల ఖాళీలు, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను ఆన్‌లైన్‌లో ప్రకటించిన తర్వాత బదిలీల కోసం అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారు పైఅధికారుల ధ్రువీకరణతో హార్డ్‌ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 14వ తేదీన ఆర్‌జేడీలచే ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల జారీ చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..