Telangana: ఆ వ్యాఖ్యలకు అర్థమేంటో..? సంచలనంగా మారిన ‘తుమ్మల’ లేటెస్ట్ కామెంట్..

Telangana: మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్య నేత తుమ్మల నాగేశ్వరరావు చేసిన తాజా కామెంట్స్.. తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది.

Telangana: ఆ వ్యాఖ్యలకు అర్థమేంటో..? సంచలనంగా మారిన ‘తుమ్మల’ లేటెస్ట్ కామెంట్..
Thummala Nageshwar Rao
Follow us

|

Updated on: Aug 03, 2022 | 4:55 PM

Telangana: మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్య నేత తుమ్మల నాగేశ్వరరావు చేసిన తాజా కామెంట్స్.. తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది. ‘ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు’.. ఇదీ మాజీ మంత్రి చేసిన ప్రకటన. అయితే, ఈ కామెంట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ కామెంట్ పై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.ఖమ్మం జిల్లాలోనే కాకుండా.. యావత్ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఆయన ఈ కామెంట్ చేయడం వెనుక అంతరార్థం ఏంటా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

బుధవారం నాడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు.. తన అనుచరులతో సమావేశమయ్యారు. నేలకొండపల్లి పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు అని, అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ జరుగకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పైనే దృష్టి పెట్టడం వలన కార్యకర్తలతో కలవలేక పోయానని, ఇప్పుడు పూర్తి సమయం కెటాయిస్తానని అన్నారు తుమ్మల. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానని, ఇప్పుడు మాత్రం పాలేరు పైనే ఫోకస్ పెడతానని తుమ్మల అన్నారు.

ఆ కామెంట్ వెనుక ఆంతర్యం ఏంటి? ‘ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు’ అంటూ తుమ్మల చేసిన కామెంట్‌పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్.. ఆ ప్రచారాన్ని ధృవీకరిస్తున్నాయని చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. మరికొందరు కీలక నేతలు కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారంటూ బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటనల క్రమంలో తుమ్మల తాజా కామెంట్స్.. పార్టీ మార్పు వాదనను బలబరుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ముందస్తు ఎన్నికలు జరుగనున్నాయా? ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, కార్యకర్తలంతా ఎన్నికల కోసం సన్నద్ధమవ్వాలనే ఉద్దేశ్యంతో తుమ్మల ఈ కామెంట్ చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ముందస్తు ఎన్నికలకు పోయే పరిస్థితి ఉండటంతో.. ఈసారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో తన అనుచరులతో ఇలా అన్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..