తెలంగాణలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం.. ప్రభుత్వంపై ఉద్యమించి డిమాండ్లు సాధించుకోవాలని ఉత్తమ్‌ పిలుపు

తెలంగాణలో ప్రభుత్వ వైఖరితో ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగులు ఎంతో కాలంగా..

తెలంగాణలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం.. ప్రభుత్వంపై ఉద్యమించి డిమాండ్లు సాధించుకోవాలని ఉత్తమ్‌ పిలుపు
Follow us

|

Updated on: Jan 28, 2021 | 2:47 PM

తెలంగాణలో ప్రభుత్వ వైఖరితో ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్‌సీ రిపోర్టు ఎంతో నిరాశను కలిగించిందని అన్నారు. కేవలం 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం అన్యాయం కాదా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

కేసీఆర్‌ ఆదేశాలతోనే 7.5 శాతం ఫిట్‌మెంట్ నిర్ణయం జరిగిందని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దుయ్యబట్టారు. 43 శాతానికి తగ్గకుండా ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. హౌస్ అలవెన్స్ తగ్గించడం ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగస్తులంను ప్రభుత్వం చులకనభావంతో చూస్తుంని విమర్శించారు.

రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ రిపోర్ట్ వెల్లడించింది. ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు తొత్తులుగా వ్యవహరిస్తున్నందు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్యోగుల ఫ్రెండ్లీగా పనిచేశాయి. ఇప్పటికైనా ఉద్యోగులు ఉద్యమించి తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకోవాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.? పలు కీలక