Telangana: మహబూబాబాద్‌లో అద్భుతం.. ఆకాశంలోకి ఎగసిన నీరు.. వీడియో మీకోసం..!

Telangana: తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో టోర్నడో కలకలం రేపింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఆకాశం పైకి నీళ్లు వెళ్తున్న దృశ్యం కనువిందు చేసింది.

Telangana: మహబూబాబాద్‌లో అద్భుతం.. ఆకాశంలోకి ఎగసిన నీరు.. వీడియో మీకోసం..!
Tornado
Follow us

|

Updated on: Aug 03, 2022 | 9:44 PM

Telangana: తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో టోర్నడో కలకలం రేపింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఆకాశం పైకి నీళ్లు వెళ్తున్న దృశ్యం కనువిందు చేసింది. అవును మీరు చదివింది నిజంగా నిజం. సాధారణంగా అమెరికాలో మాత్రమే దర్శనమిచ్చే ‘టోర్నడో’లు తాజాగా తెలంగాణా రాష్ట్రంలోనూ తారసపడ్డాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని కొత్తగూడ మండలం వేలుబెల్లిలో ఆకాశం పైకి నీళ్లు వెళ్తున్న దృశ్యం కనిపించింది. జిల్లాలో వింతగా టోర్నడో దర్శనం ఇవ్వడం చూసిన అక్కడి ప్రజలకు ఒళ్లంతా వణుకు పుట్టింది. దీంతో భయంతో పరుగులు పెట్టారు. సుడిగాలి నీళ్లను తీసుకొని రివ్వున ఆకాశానికి చేరింది. దీంతో అక్కడ గ్రామ ప్రజలు సమీపంలో పనిచేస్తున్న కూలీలు కాసేపు భయపడ్డా.. ఆ తర్వాత మాయం అవడంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఆకాశాన్ని, భూమిని తాకుతూ ఏర్పడే పెద్ద పెద్ద ఈ సుడిగాలులు మన దేశంలో చాలా తక్కువ.

ఇలాంటివి ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే చూస్తుంటాం. ఏటా ఆ దేశంలో దాదాపు 1200 టోర్నడోలు సంభవిస్తుంటాయి. ఈ టోర్నడోలు అక్కడ బీభత్సం సృష్టిస్తాయి. దానికి ఏది అడ్డొచ్చిన ఆ దుమ్ములో కలిసి పోవాల్సిందే. ఈ టోర్నడోల బీభత్సానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించిన దాఖలాలున్నాయి. అయితే భారత్‌లో మాత్రం టోర్నడోలు చాలా అరుదనే చెప్పాలి. అలాంటిది ఏజెన్సీలోని కొత్తగూడ మండలం వెలుబెల్లిలో ఈ ఘటన చోటుచేసుకోవడం కాస్త వింతంగా అనిపించింది. ఒక్కసారిగా సుడిగాలిలా ప్రారంభమై నిమిషాల్లోనే పెద్దదయి నీళ్లు ఆకాశంలోకి వెళ్లాయి. ఇలా ఆకాశం పైకి నీళ్లు వెళ్తున్న దృశ్యం అక్కడి ప్రజలు ఆందోళనకు గురి చేసింది. టోర్నడో వేగంగా సుడులు తిరుగుతూ అల్లకల్లోలం చేసింది. మరోవైపు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థులు సెల్ ఫోన్లలో రికార్డు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..