Telangana: హడలెత్తిస్తున్న పెద్దపులి సంచారం.. బిక్కుబిక్కుమంటున్న గ్రామస్థులు

అడవులు తగ్గిపోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. గ్రామాల్లో ఇళ్లల్లో చొరబడి భయాందోళన కలిగిస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తూ హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలోని మంచిర్యాల (Mancherial) జిల్లాలో...

Telangana: హడలెత్తిస్తున్న పెద్దపులి సంచారం.. బిక్కుబిక్కుమంటున్న గ్రామస్థులు
Bengal Tiger
Follow us

|

Updated on: Aug 04, 2022 | 6:59 AM

అడవులు తగ్గిపోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. గ్రామాల్లో ఇళ్లల్లో చొరబడి భయాందోళన కలిగిస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తూ హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలోని మంచిర్యాల (Mancherial) జిల్లాలో పులి సంచారం కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు రెండు రోజుల్లో రెండు పశువులను చంపేసిన పెద్దపులి కోసం వేట మొదలుపెట్టారు. కోటపల్లి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో పెద్దపులి వణికిస్తోంది. అటవీ గ్రామాలైన ఎడగట్ట, నాగంపేట్‌, వెంచపల్లి, బొప్పారంలో తిరుగుతోన్న పెద్దపులి.. వరసగా పుశువులపై ఎటాక్‌ చేస్తూ బీభత్సం సృష్టిస్తోంది. రెండ్రోజుల్లో రెండు పశువులను చంపేసింది పెద్దపులి. దాంతో, ఆ నాలుగు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు? ఎక్కడ? తమపై దాడి చేస్తుందోననే భయంతో పొలాల వైపే వెళ్లేందుకు జంకుతున్నారు. పులి సంచారంపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో అటవీ అధికారులు విచారణ మొదలు పెట్టారు. పులి అడుగు జాడలను గుర్తించి, ఆ నాలుగు గ్రామాల్లో చాటింపు వేయించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, చీకటి పడ్డాక ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచిస్తున్నారు.

అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండటంతో వెంచపల్లి, బొప్పారం, ఎడగట్ట, నాగంపేట్‌, గ్రామాలకు వన్యప్రాణుల బెడద ఎక్కువగా ఉంటోంది. పదేపదే పులులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి పులి గ్రామాల్లోకి రావడంతో ప్రజలు హడలిపోతున్నారు. రెండు రోజుల్లో రెండు పశువులపై దాడిచేసి చంపేయడంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా రేజీంతల్‌లో పులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ రైతు పొలానికి వెళ్తుండగా చిరుత కనిపింది. దీంతో భయాందోళనకు గురైన అతడు మళ్లీ గ్రామానికి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామానికి చేరుకున్న అధికారులు.. ఆ ప్రాంతంలో కాలి ముద్రలను పరిశీలించారు. కాగా, అది చిరుత లేదా మరేదైనా జంతువా అనే విషయాన్ని నిర్ధారిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

కాగా.. మంచిర్యాల జిల్లాలో పులి కలకలం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. పులి కదలికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో ఉన్నావారు గడపదాటి బయటికు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..