Nalgonda: ట్రాక్టర్‌ని ఢీకొన్న బైక్.. అన్నాచెల్లెళ్లతో సహా ముగ్గురు మృతి

Nalgonda: ట్రాక్టర్‌ని ఢీకొన్న బైక్.. అన్నాచెల్లెళ్లతో సహా ముగ్గురు మృతి
Road Accident

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.

Ram Naramaneni

|

Jan 11, 2022 | 8:37 AM

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఈ యాక్సిడెంట్ జరిగింది. అదే మండలంలోని వాడపల్లికి చెందిన అన్నాచెల్లెళ్లు ధనావత్ అంజి(20), ధనావత్ అంజలి(17), వారి మేనల్లుడు రమావత్ నవదీప్(8) బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బొత్తలపాలెం వద్దకు రాగానే ముందు ఉన్న ట్రాక్టర్‌ని బైక్‌ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 10 నిమిషాల్లో ఇంటికి చేరతారనగా ప్రమాదం జరిగిందని బంధువులు తెలిపారు. ప్రమాద స్థలంలో పుస్తకాలు, కాలేజీ బ్యాగ్ చిందరవందరగా పడిపోయాయి. బైక్ పూర్తిగా ధ్వంసమైంది.

అంజి గూడురు వద్ద రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తుండా, అంజలి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. వీరి తండ్రి సిమెంట్ ఫ్యాక్టరీలో లోడింగ్ కార్మికుడిగా, తల్లి జ్యోతి వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. ఒక్కసారే ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Nalgonda District: మైసమ్మ గుడి ముందు మనిషి తల కేసులో పోలీసుల పురోగతి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu