Telangana: నిజమాబాద్‌ వాసులకు దడ పుట్టిస్తోన్న విష జ్వరాలు.. రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు..

Telangana: చల్లాగా మారిన వాతావరణం, భారీ వర్షాలు, పారిశుధ్య లోపం వెరసి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు ప్రభలుతున్నాయి. అస్తవ్యస్తమైన పారిశుధ్యంతో ఉమ్మడి జిల్లాలో సీజనల్​ వ్యాధులు విజృంభిస్తున్నాయి..

Telangana: నిజమాబాద్‌ వాసులకు దడ పుట్టిస్తోన్న విష జ్వరాలు.. రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు..
Representative Image
Narender Vaitla

|

Aug 06, 2022 | 9:37 PM

Telangana: చల్లాగా మారిన వాతావరణం, భారీ వర్షాలు, పారిశుధ్య లోపం వెరసి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు ప్రభలుతున్నాయి. అస్తవ్యస్తమైన పారిశుధ్యంతో ఉమ్మడి జిల్లాలో సీజనల్​ వ్యాధులు విజృంభిస్తున్నాయి.డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయి కాలనీలు కంపుకొడుతున్నాయి. దోమలు విపరీతంగా వృద్ధి చెందుతూ.. మలేరియా, డెంగీ , సీజనల్​జ్వరాలకు వాహకాలుగా మారుతున్నాయి. దీంతో ప్రజలు జ్వరాలతో సతమతమవుతున్నారు.

నిజామాబాద్‌ మున్సిపాలిటీల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలు కుడుతుండడంతో చిన్నారులు, వృద్ధులకు విషజ్వరాలు వస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో గత సీజన్‌లో.. రోజూ 600 మంది విష జ్వరాల బారిన పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 500 డెంగీ కేసులు నమోదు కాగా 30 మందికి పైగా చనిపోయారు. ఈ ఏడాది తాజాగా 32 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ, మలేరియా ప్రబలుతున్నా ఆఫీసర్లు పట్టించుకుంటలేరని, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రోగులతో దర్శనమిస్తోన్న ఆసుపత్రులు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. జ్వరాలు చిన్నారుల, వృద్దుల ఆరోగ్యం పై ప్రభావం చూపెడుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు.. పిల్లలతో నిండిపోతున్నాయి. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటం, వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్ దాడి చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రతి పది మందిలో ఒకరికి జలుబు, జ్వరంతో కూడిన వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తుంటాయని సరైన జాగ్రత్తలు పాటిస్తే వైరల్‌ ఫీవర్‌ రాకుండా ఉండగలమని చెబుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో వైరల్ జ్వరాలతో ఆసుపత్రికి వస్తోన్న సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. చిన్న పిల్లల వార్డులలో సైతం జలుబు, దగ్గు జ్వరంతో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతందని వైద్యులు చెబుతున్నారు. ఇటు పిల్లల తల్లిదండ్రులు సైతం పిల్లలకు వస్తున్న జ్వరాలతో ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu