Telangana: మానవత్వం మంట కలిసింది.. మృతదేహాన్ని అడ్డుకున్న ఇంటి యజమానులు..!

కరీంనగర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వైపు భర్త అంత్యక్రియల కోసం సాయం చేయాలని వేడుకోలు.. మరో వైపు అద్దెకు ఉంటున్న ఇంట్లో ఇంటి యజమాని రానివ్వకపోవడంతో రోడ్డు మీదనే మృతదేహంతో నిరీక్షణ.

Telangana: మానవత్వం మంట కలిసింది.. మృతదేహాన్ని అడ్డుకున్న ఇంటి యజమానులు..!
Karimnagar
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 25, 2024 | 3:55 PM

కరీంనగర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వైపు భర్త అంత్యక్రియల కోసం సాయం చేయాలని వేడుకోలు.. మరో వైపు అద్దెకు ఉంటున్న ఇంట్లో ఇంటి యజమాని రానివ్వకపోవడంతో రోడ్డు మీదనే మృతదేహంతో నిరీక్షణ. చివరికి ఊరు బయట ఉంచి ఇద్దరు కూతుళ్ళతో కలిసి వేడుకుంటున్న దృశ్యం పలువురిని కలచివేసింది.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం దర్మరాజుపల్లి గ్రామం లో కోట లక్ష్మణ్, ప్రేమలత అనే దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కూలీ పని చేసుకుంటూ ఉన్నంతలో ఇద్దరు కూతుళ్ళకు వివాహం చేశారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా లక్ష్మణ్ కింద పడిపోవడంతో గ్రామస్థుల సహాయంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి లక్ష్మణ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చిన అనంతరం ఇంటి యజమాని ఇంట్లోకి మృతదేహాన్ని అనుమతించలేదు.

దీంతో ఊరి బయట ఒక చిన్న టెంట్ ఏర్పాటు చేసి మృత దేహాన్ని ఉంచింది మృతుని భార్య. ఈ సందర్భంగా తన భర్త అంత్యక్రియలకు సాయం చేయాలని కోరుతున్న దృశ్యాన్ని చూసి పలువురు కంట తడి పెట్టారు. చివరికి కొందరు గ్రామస్తులు కనికరించడంతో వారి సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. కొడుకులు లేకపోవడంతో కూతుళ్ళు దహన సంస్కారాలు పూర్తి చేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్