Basara IIIT: రణరంగంలా మారిన బాసర ట్రిపుల్ ఐటీ.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం..

బాసర ట్రిపుల్‌ ఐటీలో (Basar IIIT) మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన హామీలు ఏవీ అమలు కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో సమస్య ఒక్క అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టు...

Basara IIIT: రణరంగంలా మారిన బాసర ట్రిపుల్ ఐటీ.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం..
Basara iiit
Follow us

| Edited By: Team Veegam

Updated on: Aug 01, 2022 | 2:56 PM

బాసర ట్రిపుల్‌ ఐటీలో (Basara IIIT) మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన హామీలు ఏవీ అమలు కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో సమస్య ఒక్క అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. అయితే తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందేనని, లేకుంటే విపరీతమైన చర్యలు ఉంటాయని స్టూడెంట్స్ హెచ్చరిస్తున్నారు. బాసరలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ సిట్యువేషన్‌ అయితే మళ్లీ రిపీట్‌ కాకూడదనుకున్నారో అదే రిపీటైంది. తమ డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు మరోసారి పోరాటానికి దిగారు. కొద్దిరోజులుగా ఆందోళన కొనసాగిస్తోన్న స్టూడెంట్స్‌.. ఈసారి తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా వారికి వారి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దీంతో బాసర ట్రిపుల్‌ ఐటీ ఇష్యూ స్టేట్‌ వైడ్‌ గా కాక రేపుతోంది. మెస్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ ఇస్తే సరిపోదని, ఫైనలైజ్‌ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు.. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధుల ఆందోళన ఊహించని విధంగా తీవ్రరూపం దాల్చుతోంది. స్టూడెంట్స్‌కు అండగా తల్లిదండ్రులు కూడా ధర్నాలో పాల్గొనడం, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించడం ఇలాంటి ఘటనలు హాట్ టాపిక్ గా మారాయి.

కాగా.. విద్యార్ధుల డిమాండ్లన్నీ పరిష్కరిస్తున్నామని ఇన్‌ఛార్జ్‌ వీసీ వెంకటరమణ చెబుతున్నారు. ఆందోళన విరమించాలని సూచిస్తున్నారు. విద్యార్ధులు కోరుతున్నట్లుగా, ఎక్స్‌పర్ట్‌ కమిటీ పరిశీలన తర్వాత కొత్త మెస్‌ కాంట్రాక్టరును ఫైనలైజ్‌ చేస్తుందని చెప్పారు. తిండీతిప్పులు మానేసి ఆందోళన చేస్తోన్న స్టూడెంట్స్, తమ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు భోజనం చేయమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దాంతో, బాసర ట్రిపుల్‌ ఐటీలో పరిస్థితి రణరంగంలా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..