University VC: తెలంగాణ యూనివర్సిటీ వీసీపై తీవ్ర విమర్శలు.. డబ్బులు పంచుతూ విద్యార్థినులతో డ్యాన్స్‌లు!

University VC: తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తాపై తీవ్ర విమర్శలు ఎగురవుతున్నాయి. ఆయన చేసిన పనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో..

University VC: తెలంగాణ యూనివర్సిటీ వీసీపై తీవ్ర విమర్శలు.. డబ్బులు పంచుతూ విద్యార్థినులతో డ్యాన్స్‌లు!
Follow us

|

Updated on: Sep 10, 2022 | 10:36 AM

University VC: తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తాపై తీవ్ర విమర్శలు ఎగురవుతున్నాయి. ఆయన చేసిన పనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వెంటనే ఆయనపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. నిజామాబాద్‌లో నిన్న వినాయక నిమజ్జనం తర్వాత వర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌లో వీసీ డాన్సులు చేశారు. అనుమతి లేకున్నా వీసీతో పాటు హాస్టల్‌లోకి ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు వచ్చారని, హాస్టల్‌లో డాన్స్‌ చేస్తూ డబ్బులు పంచారని ఆరోపిస్తున్నారు.

వీసీ రవీందర్‌ గుప్తా తీరుతో విద్యార్థినులు విస్తుపోయారు. వీసీ డాన్స్‌లు, డబ్బులు పంచడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే యూనివర్సిటీ వీసీ పనితీరుపై విద్యార్థి సంఘాలే కాకుండా పలువురు కూడా మండిపడుతున్నారు. విద్యార్థినులతో ఇలా వ్యహరిస్తూ డ్యాన్స్‌లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి