Telangana: తెలంగాణ రాజకీయాల్లో తగ్గని ఫిరాయింపుల వేడి.. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఏపార్టీ..?

| Edited By: Balaraju Goud

Sep 24, 2024 | 3:46 PM

ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు.. నేతల గోడ దూకుళ్ళు సర్వసాధారణం.. ఈ తంతు ఎన్నికలు పూర్తై, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అడపా దడపా జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో అయితే.. ఈ వ్యవహారాన్ని జనాలు సైతం చాలా లైట్‌గా తీసుకుంటున్నారు.

Telangana: తెలంగాణ రాజకీయాల్లో తగ్గని ఫిరాయింపుల వేడి.. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఏపార్టీ..?
Political Defections
Follow us on

ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు.. నేతల గోడ దూకుళ్ళు సర్వసాధారణం.. ఈ తంతు ఎన్నికలు పూర్తై, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అడపా దడపా జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో అయితే.. ఈ వ్యవహారాన్ని జనాలు సైతం చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. కానీ గోడదూకిన ఎమ్మెల్యేలు… అటో, ఇటో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడటం ఏదైతే ఉందో… అదేఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని నిప్పుల కుంపటిలా ఉడికిస్తోంది. కండువా మార్చి, ప్రభుత్వంలో కీలక పదవి దక్కించుకున్న ఆ జంపింగ్‌ ఎమ్మెల్యేకి.. తాను ఏ పక్షాన ఉన్నానో కూడా చెప్పుకునే పొజిషన్‌ లేకుండా పోయిందట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏమా కథ?

తెలంగాణలో మరోసారి ఫిరాయింపుల రాజకీయం రచ్చరేపుతోంది. ఇటీవల జరిగిన సీఎల్పీ భేటీలో… శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రత్యక్షమవడంతో.. ఈ వ్యవహారం మరోసారి టాప్‌న్యూస్‌లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ల మధ్య రచ్చ రాజకీయ వర్గాలలో తీవ్ర దుమారం లేపింది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఆరికెపుడు గాంధీ, ప్రకాష్ గౌడ్ లతోపాటు మొత్తం పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద లు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను కలసి వినతి పత్రం ఇచ్చినా ఆయన పట్టించుకోట్లేదని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదును విచారించిన కోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యాలయానికి సూచించింది. ఈ వ్యవహారంలో ఆరికెపుడు గాంధీ స్పందిస్తూ నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, బీఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి అరికెపుడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని చెప్పడంతో, దమ్ముంటే మా ఇంటికి రావాలి.. లేదంటే నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరారు. అంతేకాు ఏకంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ అనుచరులతో ఇంటి మీద హంగామా చేశాడు.

అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై ఆరికెపుడిగాంధీ స్పందించనప్పటికి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సీఎల్పీ సమావేశం జరిగిన మాదాపూర్ ప్రాంతం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని మార్యద పూర్వకంగా కలిశాడు. దానికి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఇదంతా ఒకెత్తైతే మాదాపూర్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ కి ఆరికెపుడు గాంధీ హాజరయ్యారు. ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనప్పుడు సీఎల్పీ సమావేశానికి ఎలా వెళతారనేది ప్రతిపక్షాల ఆరోపణ. హరీష్ రావు కూడా ఇప్పటికే కౌంటర్ స్టార్ట్ చేశారు.

వివాదం నుంచి బయటపడేందుకు, తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకొన్న అరెకపూడి గాంధీ.. ఇప్పుడు సీఎల్పీ భేటీలో పాల్గొనడం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో చేరినట్టు గతంలో ఎక్స్‌లో పోస్టు చేసిందీ ఆయనే.. పబ్లిగ్గా ప్రకటించిందీ ఆయనే… ఆ తర్వాత పీఏసీ చైర్మన్‌ పదవి విషయంలో వివాదం చెలరేగడంతో తాను కాంగ్రెస్‌లో చేరలేదన్నదీ ఆయనే… ఇప్పుడు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష భేటీకి హాజరైందీ ఆయనే.. కానీ, ఇప్పటికీ ఆయన అటో, ఇటో అన్నది మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తానెటువైపనే విషయాన్ని గాంధీ కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి.

మరి ప్రతిపక్షాల విమర్శలకు పీసీసీ చీప్ మహేష్ గౌడ్, మంత్రులు ఏవిధంగా సమాధానం చెప్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…