Telangana MLC Sworn ceremony: నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం శాసన మండలి చైర్మన్ చాంబర్లో ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ.. కవిత చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
కవితతో పాటు కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి వారితో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కవిత,దామోదర్ రెడ్డి లకు మంత్రి మండలి రూల్స్ బుక్స్,ఐడి కార్డు అందజేశారు. అనంతరం పుష్పగుచ్చమ్ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
I thank everyone who attended my swearing-in ceremony today and I pray for speedy recovery of Sri @PSRTRS garu, Sri @jeevanreddytrs garu, MLC Sri Rajeshwar garu who couldn’t join us today. pic.twitter.com/t3y04wQPvi
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 19, 2022
ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కవిత ధన్యవాదాలు తెలిపారు.
Read Also…. JC Diwakar Reddy: ప్రగతి భవన్ వద్ద మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి హల్చల్.. భద్రతా సిబ్బందితో వాగ్వాదం!