Revanth Reddy: మళ్లీ భగ్గుమన్న వర్గ విబేధాలు.. రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన వాయిదా..!

మరోసారి కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంది. దీంతో రేపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన సందిగ్దత నెలకొంది. రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశంపై సీనియర్లు ఇంట్రెస్ట్‌ చూపడం లేదని తెలుస్తోంది.

Revanth Reddy: మళ్లీ భగ్గుమన్న వర్గ విబేధాలు.. రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన వాయిదా..!
Revanth Reddy Komatireddy Venkat Reddy
Follow us

|

Updated on: Apr 26, 2022 | 3:22 PM

Revanth Reddy Nalgonda Tour: మరోసారి కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంది. దీంతో రేపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన సందిగ్దత నెలకొంది. రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశంపై సీనియర్లు ఇంట్రెస్ట్‌ చూపడం లేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన వాయిదా పడింది. అయితే ఇంకా షెడ్యూల్, సభావేదిక ఖరారు కాలేదని సమాచారం. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం రేవంత్ సన్నాహక సమావేశాన్ని వ్యతిరేకిస్తుంటే.. ఇటు జానారెడ్డి, దామోదర్ రెడ్డి వర్గీయులు ఆహ్వానిస్తున్నారు. రేపు రేవంత్ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు..

ముందుగా ప్రకటించిన ప్రకారం.. రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే రేవంత్ పర్యటన వాయిదా పడినట్టుగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ తెలిపింది. రేవంత్ పర్యటన తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు వ్యతిరేకించడంతోనే రేవంత్ జిల్లా పర్యటన వాయిదా పడినట్టుగా రేవంత్ రెడ్డి వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.

ఇక, మే 6వ తేదీన వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నాయకులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం.. కరీంనగర్‌లో పర్యటించారు. ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన నాయకుల, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షణ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇక, నేడు ఖమ్మం జిల్లాలో రేవంత్ పర్యటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తిచేశాయి. అయితే ఖమ్మంలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీల తొలగింపు వివాదం చోటుచేసుకుంది. రేవంత్ ఖమ్మం రానున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రేవంత్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆవేశంలో కొందరు కార్యకర్తలు అధికారుల వాహనాలపై దాడి చేయడంతో.. అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనంతరం రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి.

Read Also… Supreme Court: ధర్మసంసద్‌ సమావేశానికి అనుమతి ఇవ్వొద్దు.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?