కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ జిల్లాల్లోని స్థానిక ఉత్పత్తులకు జీఐ ట్యాగ్..

స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ పరంగా మరింత వృద్ధి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, పరిశ్రమల సంస్థ సీఐఐ

  • Rajitha Chanti
  • Publish Date - 9:08 am, Sat, 27 February 21
కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ జిల్లాల్లోని స్థానిక ఉత్పత్తులకు జీఐ ట్యాగ్..

స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ పరంగా మరింత వృద్ధి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, పరిశ్రమల సంస్థ సీఐఐ ఏర్పాటు చేసిన తెలంగాణ ఐపీ ఫెసిలిటేషన్ సెంటర్ తాజాగా మరో నాలుగు ఉత్పత్తులకు జీయోగ్రాఫికల్ ఐడేంటిఫికేషన్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 4 స్థానిక ఉత్పుత్తులైన చపాత మిర్చి (వరంగల్), పసుపు (నిజామాబాద్), లక్క గాజులు (హైదరాబాద్), కస్టర్డ్ ఆపిల్ (బాలానగర్) ప్రభుత్వం గుర్తించింది. ఇదిలా ఉండగా.. మరో ఉత్పత్తి అయిన రెడ్ గ్రామ్ (తాండూర్) కోసం గతేడాది దరఖాస్తు చేశారు.

ప్రస్తుతం గుర్తించిన నాలుగు ఉత్పత్తులు మార్కెట్లో మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మరిన్ని ఉత్పత్తులను భవిష్యత్తులో గుర్తిస్తామని.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 15 జీఓలను చేజిక్కించుకుంది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ప్రోగ్రాం కోసం జీఐలు కీలకంగా ఉంటాయని సీఐఐ తెలంగాణ హెడ్, డైరెక్టర్ సుభాజిత్ సాహా అన్నారు.

పోచంపల్లి ఇక్కత్ రాష్ట్రానికి మొదటి జీఐ (పూర్వపు ఆంధ్రప్రదేశ్) మరియు దేశంలో నాల్గవది. ఇప్పుడు ఉన్న 15 జీఐలలో 12 అప్లికేషన్లను కేంద్రం పొందుపర్చింది. హైదరాబాద్ హలీమ్ మినహా (జీఐ ట్యాగ్ ఫుడ్ వచ్చింది) అన్నీ హస్తకళల కోసమే తీసుకువచ్చింది. “మేము ఇప్పుడు తాండూర్ రెడ్‌గ్రామ్, నిజామాబాద్ పసుపు, వరంగల్ చపాటా మిరపకాయ మరియు బాలానగర్ కస్టర్డ్ ఆపిల్ వంటి వ్యవసాయ జీఐలపై కేంద్రాన్ని అడుగుతున్నాం” అని ఆయన చెప్పారు. హైదరాబాద్‏లోని లక్కగాజులకు ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అనేక శతాబ్దాల క్రితం హైదరాబాద్‌లో లక్కడ్ గాజులు తయారు చేయబడినట్లు డాక్యుమెంటేషన్ ఉంది. “అంతకుముందు, జీఐ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలనేది నిర్ణయించాం. ఇప్పుడు మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రమోషన్, అమలులో ఉన్న సవాళ్లను అధిగమించడంపై దృష్టి సారించమని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకమైన జీఐ స్టోర్, జీఐ మ్యూజియం ప్రతిపాదించబడ్డాయని చెప్పుకోచ్చారు.

ఈ జీఐ సర్టిఫైడ్ ఉత్పత్తులను ఇ-కామర్స్ పోర్టల్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెజాన్ కూడా తెలంగాణతో సహా 18 రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకుంది. షాపింగ్ కార్ట్ 24.కామ్ , గోకోప్ వంటి కొన్ని సైట్లు ఇప్పటికే జీఐ రిజిస్టర్డ్ ఉత్పత్తులను అమ్ముతున్నాయి. ఉత్పత్తిని పెంచడంతోపాటు డిజిటల్ ఛానెళ్ల వాడకం డిమాండ్ పెంచడానికి సహయపడుతున్నట్లు సాహా అన్నారు. హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ ముత్యాల కోసం జీఐ దరఖాస్తులు గతంలో దాఖలు చేయబడ్డాయి. “బిర్యానీకి జీఐ కోసం ప్రయత్నించినా అంతగా సాధ్యపడలేదు. ఇది ఇప్పుడు సాధారణ ఉత్పత్తి. ముత్యాల కోసం GIకి తప్పనిసరి ”అని ఆయన అన్నారు.

ముఖ్య లక్షణాలు…

చపాటా మిరపకాయలు…

ఇవి వరంగల్ స్పెషాలిటీ.. ఇవి గ్రీన్ మిర్చి. ఎండిపోయి ఎరుపుగా మారుతుంది. ఇది లోతైన ఎరుపు రంగు పాడ్‌లతో ప్రత్యేకమైన తీపి సువాసన, గొప్ప రుచిని కలిగి ఉంటుంది. తీపి మిరపకాయలలో ఒకటి. పచ్చడి తయారీదారులు కీలకమైన కొనుగోలుదారు మధ్య భారతదేశం నుంచి అత్యధిక డిమాండ్ కలిగి ఉన్నాయి. వారిలో కొందరు జపాన్, కొరియాకు వీటిని ఎగుమతి చేయడం జరుగుతుంది. కేవలం 15 వేల టన్నుల సాగు చేయబడుతుంది.

పసుపు..

నిజామాబాద్‌లో ఉత్పత్తి చేసే పసుపు నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం నుంచి వచ్చే పసుపు ప్రపంచంలోని మొత్తం పసుపు ఉత్పత్తిలో 8 నుండి 10 శాతం ఉంటుంది. ఇది అంతర్జాతీయంగా డిమాండ్‌ చేస్తుంది.

లక్క గాజులు..

లక్ గాజులు హైదరాబాద్‌కు ప్రత్యేకమైనవి. లాడ్ బజార్‌లో తయారైన లక్క గాజులు స్థానిక కొనుగోలుదారులతో పాటు పర్యాటకులను కూడా ఆకర్షిస్తాయి. ప్రకాశవంతమైన రంగులు, అలంకారాలలో లక్క గాజులు చాలా మందికి ఫ్యాషన్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో 15వ శతాబ్దం నుంచి లక్క గాజులు తయారయ్యాయని అంటారు.

కస్టర్డ్ ఆపిల్..

(బాలానగర్) దాని సైజ్, అత్యంత తీపివైనవి. వీటికి ప్రత్యేక స్థానం ఉంది.

Also Read:

హాలిడే టూర్స్ ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకోసం 3 అద్భుతమైన హిల్ స్టేషన్స్.. ఎక్కడున్నాయో తెలుసా..