Polavaram: పోలవరం ముంపుపై సమగ్ర అధ్యయనం చేయాలి.. ఏపీ చేపట్టిన ఆ ప్రాజెక్టులు ఆపేయాలి.. కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ

Telangana: పోలవరం ప్రాజెక్టు పూర్తైతే.. భద్రాచలానికి ముంపు తప్పదా? తెలంగాణలో 160 గ్రామాలకు ప్రభావం తప్పదా? పోలవరం వెనుక జలాల ముంపుపై అధ్యయనం జరగలేదా? అంటే అవుననే అంటోంది తెలంగాణ.

Polavaram: పోలవరం ముంపుపై సమగ్ర అధ్యయనం చేయాలి.. ఏపీ చేపట్టిన ఆ ప్రాజెక్టులు ఆపేయాలి.. కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ
Polavaram
Basha Shek

|

Sep 23, 2022 | 10:49 AM

Telangana: పోలవరం ప్రాజెక్టు పూర్తైతే.. భద్రాచలానికి ముంపు తప్పదా? తెలంగాణలో 160 గ్రామాలకు ప్రభావం తప్పదా? పోలవరం వెనుక జలాల ముంపుపై అధ్యయనం జరగలేదా? అంటే అవుననే అంటోంది తెలంగాణ. ఊరికే ఆరోపణలకే పరిమితం కావడం కాదు.. ఏకంగా ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపు ప్రభావం, తెలంగాణ ప్రాంతంలో పరిరక్షణ చర్యలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టాలని కోరుతూ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో సీడబ్ల్యూసీ డిజైన్‌ చేయగా.. 36 లక్షల క్యూసెక్కుల మేరకు మాత్రమే నిర్మించారని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ మేరకు వచ్చే ముంపుపైనే సాంకేతికంగా అధ్యయనం జరిగినట్టు చెప్తోంది. కాగా మొన్న వచ్చిన వరదలతో భద్రాచలం టెంపుల్‌ టౌన్‌, మణుగూరు కర్మాగారం, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలతో పాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టు పూర్తయితే నది వెనుక భాగంలో ఏర్పడే పూడికతో ముంపు మరింత పెరుగుతుంది. ఈ కోణంలో అధ్యయనం చేయాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

పోలవరం స్పిల్‌వే, కాఫర్‌ డ్యాం 42.5 మీటర్లు పూర్తవ్వగా.. ఈ ఏడాది జులైలో 38.76 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు పూర్తయ్యాక పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్ల మేర నిల్వ ఉంటే దుమ్ముగూడెం నుంచి భద్రాచలం వరకు రెండు వైపులా అదనంగా 60 గ్రామాలు ముంపునకు గురవుతాయి. అంతే కాకుండా జలాశయంలో గరిష్ఠ స్థాయిలో 193.5 అడుగుల మేర అంటే 59 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉంచితే.. భద్రాచలం దగ్గర వరద స్థాయి 33.60 లక్షల క్యూసెక్కులు ఉండే అవకాశాలున్నట్లు సీడబ్ల్యూసీ 2012స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా సమగ్ర అధ్యయనం చేయాలంటోంది.

ఆ ప్రాజెక్టులు నిలిపేయాల్సిందే..

కాగా పోలవరం పూర్తైతే.. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లోనూ ముంపు ఏర్పడుతోంది. ఆ రెండు రాష్ట్రాల పరిధిలో రక్షణ చర్యలు చేపట్టారు. కానీ తెలంగాణలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది తెలంగాణ ఆరోపణ. పోలవరం జలాశయం వెనుక మిగులు, వరద జలాల ఆధారంగా ఏపీ పలు ఎత్తిపోతల పథకాలు చేపట్టింది. వీటి కోసం ప్రాజెక్టులో నిల్వను ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్థాయిలో ఎక్కువ కాలం కొనసాగిస్తే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఈ నిర్మాణాలు నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతోంది తెలంగాణ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu