Telangana: అత్యధిక సైబర్ నేరాలు జరిగిన రాష్ట్రం ఏదో తెలుసా? తెలంగాణ ప్లేస్ ఎక్కడంటే?

| Edited By: Velpula Bharath Rao

Dec 01, 2024 | 8:01 AM

సైబర్ నేరాల వల్ల నష్టపోతున్న మొదటి అయిదు రాష్ట్రాలలో తెలంగాణ ఉండడం ఆందోళన కలిగించే విషయం. సైబర్ నేరాల నియంత్రణలో సౌదీ అరేబియా అనుసరిస్తున్న ప్యూహాలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Telangana: అత్యధిక సైబర్ నేరాలు జరిగిన రాష్ట్రం ఏదో తెలుసా? తెలంగాణ ప్లేస్ ఎక్కడంటే?
Cyber Frauds
Follow us on

సైబర్ నేరాల వల్ల నష్టపోతున్న మొదటి అయిదు రాష్ట్రాలలో తెలంగాణ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరాల నియంత్రణలో సౌదీ అరేబియా అనుసరిస్తున్న ప్యూహాలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాల మీద సౌదీ అరేబియా అవగాహన కల్పిస్తుంది. తెలంగాణలో కూడా విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సైబర్ నేరాల వల్ల రాష్ట్ర ప్రజలు రోజుకు సుమారు 4 నుండి 5 కోట్ల వరకు నష్టపోతున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 14 కోట్లు నష్టపోతున్నారు. దేశంలో సైబర్ మోసాల వల్ల అత్యధికంగా నష్టపోతున్న రాష్ట్రాలు వరుసగా
1) ఉత్తరప్రదేశ్
2) కర్ణాటక
3) మహారాష్ట్ర
4) తెలంగాణ
5) పశ్చిమబెంగాల్

అందులో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.సైబర్ నేరాల నియంత్రణలో సౌదీ అరేబియా బహుముఖ వ్యూహాలు అనుసరిస్తున్నది. సైబర్ భద్రతలో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన సౌదీ నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. సౌదీలో విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తుంటారు. విద్యార్దులకు సైబర్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక కోర్సులతో ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుస్తున్నారు. 2021లో విద్యాశాఖ, జాతీయ సైబర్ భద్రతా విభాగం జట్టు కట్టి సైబర్ భద్రతపై సంయుక్తంగా శిక్షణ, పరిశోధన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. సైబర్ సెక్యూరిటీ కోర్సులు చదివేవారికి ఉపకార వేతనాలు కూడా ఇస్తున్నాయి. ఉన్నత విద్యలో పెద్దపీట వేస్తున్నాయి. తద్వారా సైబర్ నేర నియంత్రణలో నిపుణులను సౌదీ పెద్దసంఖ్యలో తీర్చిదిద్దుకో గలుగుతోంది.రోజుకో కొత్త పన్నాగంతో సరికొత్త మోసంతో చెలరేగిపోయే సైబర్ నేరగాళ్లను ఆరికట్టాలంటే ఏం చేయాలనే దానికి సౌదీ విధానం సరికొత్తగా సమాధానమిస్తోంది.

తెలంగాణలోని అన్ని జిల్లాలలో సైబర్ నేరగాళ్లు కలవర పెడుతున్నారు. పిల్లల చదువుల కోసం దాచుకున్న కష్టార్జితాన్ని క్షణాల్లో తన్నుకుపోతున్నారు. అమ్మాయి పెళ్లి కోసం పైసా పైసా కూడబెట్టిదంతా మాయ చేసి దోచేస్తుస్తున్నారు. అవగాహన లేక కొందరు.. అత్యాశకు పోయి మరెందరో ప్రజలు సైబర్ మాయగాళ్ల బారిన పడుతున్నారు. సైబర్ నేరాల నియంత్రలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లో సైబర్ మోసాలపై చైతన్యం తీసుకురావటంలో పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో నిత్యం ఏదో ఒకచోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. చదువు కున్నవారే మోసాలకు గురవుతుండటం కలవరపరుస్తోంది. మొబైల్‌ ద్వారానే 80 శాతం సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని, పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు అవగాహన పెంచుకుని ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. మహిళలు, చిన్న పిల్లలపై నేరాలు ఎక్కువయ్యాయని పాశావికమైన ఆలోచన విధానాల వల్ల ఇటువంటివి చోటు చేసుకుంటున్నాయని, వీటి కట్టడికి చట్టాల ద్వారానే కాక విద్యార్థి దశ నుండే పిల్లల మనస్సుల్లో మార్పు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. సౌదీ తరహాలో తెలంగాణలో కూడా పదోతరగతి ఉత్తీర్ణులై బయటకు వచ్చిన విద్యార్దులకు ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో సైబర్ సెక్యూరిటీ కోర్సులను తప్పనిసరి చేస్తే నేరాలు తగ్గుముఖం పట్టడంతో పాటు విద్యార్దులను నేరాల నియంత్రణలో నిపుణులుగా మర్చవచ్చని కొందరు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి