బడి గంట: ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఆ తరగతులకు కూడా.? విద్యాశాఖ ప్రాధమిక నిర్ణయం.!

Telangana Schools Re-Open: కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా తెలంగాణలో మూతపడిన విద్యా సంస్థలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి...

బడి గంట: ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఆ తరగతులకు కూడా.? విద్యాశాఖ ప్రాధమిక నిర్ణయం.!
Follow us

|

Updated on: Jan 17, 2021 | 2:40 PM

Telangana Schools Re-Open: కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా తెలంగాణలో మూతపడిన విద్యా సంస్థలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతులకు క్లాసులు నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. కరోనా జాగ్రత్తలతో పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, విద్యాసంస్థలు తెరుచుకోనుండగా.. ఇంటర్ కళాశాలలు షిఫ్ట్ పద్దతిలో.. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీలు రోజుకు సగం మంది విద్యార్ధులతో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 6,7,8 తరగతులకు కూడా క్లాసులు ప్రారంభించాలని విద్యాశాఖ ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి కూడా పంపించిందట. మరి దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కాగా, ఈ ఏడాది 1 నుంచి 5వ తరగతి వరకు బడులు ఉండవు. ఆయా తరగతుల విద్యార్ధులకు క్లాసులు నిర్వహించకుండానే ప్రమోట్ చేయనున్నారు.