తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ‘తెలంగాణ రైతు గోస- బీజేపీ పోరు దీక్ష’

తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ తమ నివాసాల్లో దీక్ష కొనసాగిస్తున్నారు. యుద్ద..

తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని 'తెలంగాణ రైతు గోస- బీజేపీ పోరు దీక్ష'
Telangana Rythu Gosa Bjp Poru Deeksha
Follow us

|

Updated on: May 24, 2021 | 1:38 PM

తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ తమ నివాసాల్లో దీక్ష కొనసాగిస్తున్నారు. యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, తడిసిన, రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని, తరుగు పేరుతో రైతులను వేధించడం ఆపాలని అలాగే రుణమాఫీ అమలు చేయాలని, రైతు బంధు విడుదల చేయాలన్న డిమాండ్‌తో ‘తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష’లో భాగంగా బీజేపీ కార్యాలయంలో కరోనా మార్గదర్శకాలు అనుసరిస్తూ దీక్ష చేపట్టారు. దీక్షలో నిరసన చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో కోవిడ్‌, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ పోరాటాలతోనే సీఎం ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారని, జేజేపీ ఓత్తిడితోనే కేసీఆర్ రెండు హాస్పిటల్స్ సందర్శించారన్నారు. తెలంగాణలో రైతు ఏడుస్తున్నారని, ఉచితంగా యూరియా, విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని, టీఆర్‌ఎస్‌ మనసు మార్చుకుని వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

LPG Gas: షాకింగ్‌ న్యూస్‌.. ఈనెల 29 నుంచి తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్‌ హోమ్‌ డెలివరీ నిలిపివేత.. ఎందుకంటే..!

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు.. విజయవాడ విడిచి వెళ్లొద్దని షరతు