Telangana Corona: తెలంగాణలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. నేడు హైదరాబాద్‌లో ఎంతమంది వైరస్‌ బారిన పడ్డారంటే..

Telangana Corona: శాంతించిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Telangana Corona: తెలంగాణలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. నేడు హైదరాబాద్‌లో ఎంతమంది వైరస్‌ బారిన పడ్డారంటే..
Coronavirus
Follow us

|

Updated on: Jun 09, 2022 | 9:17 PM

Telangana Corona: శాంతించిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా పరిస్థితిని నిశీతంగా గమనిస్తోన్న కేంద్రం కరోనా నిబంధనలు పాటించాలని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక తెలంగాణ విషయానికొస్తే.. రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. గత 3 రోజులుగా వందకుపైగా కేసులు నమోదవుతుండడం రాష్ట్రంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. ఈనేపథ్యంలో వైద్యాధికారులతో పాటు మంత్రులు కరోనాతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇక కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచాలని స్వయంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ఇక నేటి కరోనా కేసుల విషయానికొస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 12,385 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 122 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి ఇవాళ 42 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 811 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 94 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆతర్వాత మేడ్చల్‌, మల్కాజ్‌గిరిలో 9, రంగారెడ్డి జిల్లాలో 12, సంగారెడ్డిలో 3 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

IND vs SA: ఇ’షాన్‌దార్‌’ ఇన్నింగ్స్‌.. మొదటి టీ 20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయలక్ష్యం ఎంతంటే..

Beauty Tips: కళ్ల కింద నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ ఆహార పదార్థాలను మీ డైట్‌ లో చేర్చుకోవాల్సిందే..

IND vs SA: దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన స్టార్‌ ఆటగాడు.. మ్యాచ్‌కు దూరం..