TPCC Chief Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్.. అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు..

TPCC Chief Revanth Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

TPCC Chief Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్.. అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు..
Revanth Reddy
Follow us

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 16, 2021 | 4:41 PM

TPCC Chief Revanth Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ ముట్టిడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగా శుక్రవారం నాడు ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రేవంత్ రెడ్డిని, అంజన్ కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌ల అరెస్ట్‌లను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అరెస్ట్ చేసిన తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఇదికూడా చదవండి: PM Narendra Modi: కరోనా కట్టడికి నాలుగు ఫాయింట్‌ ఫార్ములా.. రాష్ట్రాలకు సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ.

కాగా, దీనికి ముందు ఇందిరాపార్క్ వద్ద మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ కార్యర్తలను అరెస్టు చేసిన పోలీసులు వారిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత విడిచిపెడతామని చెబుతున్నారని పోలీసుల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని.. ఈ రకమైన అరెస్టులు చేసి పోలీసులతో పరిపాలన చేయాలని ప్రభుత్వం అనుకుంటే తీవ్రమైన పరిణామలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. అధికారులు ముఖ్యమంత్రి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తే.. ఎవరినీ వదిలిపెట్టమని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఐజీ ఇంటిలిజెన్స్ ప్రభాకరరావు తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ తాము చేస్తున్న కార్యక్రమం ప్రజల కోసమని చెప్పారు. ఇదికూడా చదవండి: Mysterious Island: ప్రకృతి అద్భుతం.. హిందూ మహాసముద్రంలో విలువైన వజ్రం.. మీరు ఓసారి చూడండి.

Also read: Srilanka Hindu Temples: శ్రీలంక లోని ప్రముఖ హిందు ఆధ్యాత్మక దేవాలయాలు.. పర్యాటక ప్రాంతాలు

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!