Telangana: మునుగోడు గడ్డ మీద పొలిటికల్ యుద్ధం.. స్టేట్ టు సెంట్రల్ నేతల ఎంట్రీతో రాజకీయ కోలాహలం..

Telangana: మునుగోడులో పొలిటికల్ పార్టీలు పొలికేక వేస్తున్నాయి. ఇటు స్టేట్ లీడర్స్.. అటు సెంటర్ పొలిటీషియన్స్ ఎంట్రీతో నియోజకవర్గంలో రాజకీయ కోలాహలం మొదలైంది.

Telangana: మునుగోడు గడ్డ మీద పొలిటికల్ యుద్ధం.. స్టేట్ టు సెంట్రల్ నేతల ఎంట్రీతో రాజకీయ కోలాహలం..
Munugode
Follow us

|

Updated on: Aug 19, 2022 | 6:21 PM

Telangana: మునుగోడులో పొలిటికల్ పార్టీలు పొలికేక వేస్తున్నాయి. ఇటు స్టేట్ లీడర్స్.. అటు సెంటర్ పొలిటీషియన్స్ ఎంట్రీతో నియోజకవర్గంలో రాజకీయ కోలాహలం మొదలైంది. పోటాపోటీ సభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత పొలిటికల్ యుద్ధానికి మునుగోడు వేదికైంది. అవును, మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూలే విడుదల కాలేదు. కానీ రేపో ఎల్లుండో ఎన్నికలు జరగబోతున్నాయా అనే రేంజ్‌లో ప్రచారం మొదలుపెట్టాయి పొలిటికల్ పార్టీలు. పార్టీల పోటా పోటీ సభలు.. వరుస కార్యక్రమాలతో మునుగోడులో రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. శనివారం నాడు సీఎం కేసీఆర్ మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంటే.. ఆ మర్నాడే అమిత్ షా ఆధ్వర్యంలో భారీ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు కార్యక్రమాలకు కేవలం 24 గంటలు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా జరుగనుంది. దీంతో మునుగోడులో పొలిటికల్ హీట్ షురూ అయింది.

ప్రజా దీవెన పేరుతో.. ప్రజాదీవెన పేరుతో రేపు టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేదిక పైనుంచే తమ పార్టీ అభ్యర్ధిని ఖరారు చేయనున్నట్టు ఇటీవలే జరిగిన రివ్యూ మీటింగ్‌లో హింట్ ఇచ్చారు. ఈక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే తిరిగి టిక్కెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు షెడ్యూల్ వచ్చాకే అభ్యర్ధిని ఖరారు చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా చేస్తోంది అధికార పార్టీ. అభ్యర్ధి ఎవరైనా సరే.. భారీగా బలప్రదర్శన చేసి తమ సత్తా ఏంటో ప్రత్యర్ధులకు చూపించేలా ప్లాన్ చేస్తుంది టీఆర్‌ఎస్. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మేల్యేలు.. సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల మందితో సభ నిర్వహించేలా గులాబీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఈమేరకు ఇప్పటికే మండలాల వారిగా బాధ్యతలు కూడా కేటాయించారు.

బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక.. మరోవైపు 21వ తేదీన సాయంత్రం 5 గంటలకు బీజేపీ సభ జరగబోతోంది. ఢిల్లీ నుంచి అమిత్ షా ఈ సభకు హాజరవుతున్నారు. ఈ వేదిక మీదే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారు. ఈ సందర్భంగా భారీగా చేరికలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ గెలుపుతో జోష్ మీద ఉన్న కమలం సేనలు అదే ఉత్సాహాన్ని మునుగోడులోనూ చూపించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు.. ఇక సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రేపు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్రకు షెడ్యూల్ ఖరారైంది. ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు రేవంత్‌ ప్లాన్‌ చేశారు. అదే సమయంలో నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు పాదయాత్రలు చేయనున్నారు. రేపు రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని.. అన్ని గ్రామాల్లో జయంతి వేడుకలు నిర్వహించనుంది హస్తం పార్టీ. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపిక చేసిన వ్యక్తికే కాంగ్రెస్ టికెట్ ఇస్తేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్. రాష్ట్రంలో కాంగ్రెస్ – టీఆర్‌ఎస్ మధ్య మాత్రమే పోటీ ఉండాలన్నారు.

సెమీ ఫైనల్‌ మాదిరిగా.. మొత్తంగా మునుగోడు ఉపఎన్నికను సెమీఫైనల్‌లాగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ ఎలాగైనా గెలవాలని ముూడు ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ జోరు పెంచగా.. రేపటి సభతో కారు టాప్ గేర్ వేయబోతోంది. ఇటు హస్తం పార్టీ సైతం గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్