Telangana: జంపింగ్ జపాంగ్‌తో రసవత్తరంగా తెలంగాణ రాజకీయం.. వలసలు ఎవరికి వరం.. ఎవరికి శాపం?

Telangana Politics: వలసల గాలాలను తొలిగా టీఆర్ఎస్ వేయగా.. మధ్యలో బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేస్తోంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

Telangana: జంపింగ్ జపాంగ్‌తో రసవత్తరంగా తెలంగాణ రాజకీయం.. వలసలు ఎవరికి వరం.. ఎవరికి శాపం?
Vijaya Reddy, Revanth Reddy (File Photo)
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 25, 2022 | 5:28 PM

తెలంగాణలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. గెలుపు కోసం శరవేగంగా పావులు కదుపుతున్నాయి. రోజురోజుకూ తమ బలం పెంచుకునేందుకు తహతహలాడుతున్నాయి. నాయకులతో పాటు కార్యకర్తలను తమవైపు తిప్పుకునే కసరత్తు చేస్తున్నాయి. పనిలో పనిగా పక్క పార్టీలోని కీలక నేతల కోసం గాలం వేస్తున్నాయి. వలసల గాలాలను తొలిగా టీఆర్ఎస్ వేయగా.. మధ్యలో బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేస్తోంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒక్కో సీటు మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. ఎన్నికలు ముగిశాక..టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్న వారే. అలా వచ్చిన వారిలో కొందరు పార్టీలోనే ఉండగా..మరికొందరు గోడమీద కూర్చున్నారు. అటా ఇటా అర్థంకాని అయోమయంలో ఉన్నారనేది వాస్తవం. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కీలక నేత తాటి వెంకటేశ్వర్లు నిన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 2014లో ఎమ్మెల్యే అయిన వెంకటేశ్వర్లు…2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో మెచ్చా నాగేశ్వరరావు అధికార పార్టీలో చేరి గులాబీ కండువా కప్పుకోవడం విదితమే. వచ్చే ఎన్నికల్లో మెచ్చాకే టిక్కెట్ అనే చర్చ జరుగుతోంది. మెచ్చా కాకపోతే కొత్త కాపును గులాబీ పార్టీ నుంచి రంగంలోకి దించే అవకాశాలున్నాయి. తాను టిఆర్ఎస్ లో ఉన్నా టిక్కెట్ రాదనే అనుమానంతో పక్క పార్టీల వైపు చూశారాయన. ఉన్న విపక్ష పార్టీల్లో ఏది బెస్ట్ అనే ఆలోచన చేశారు తాటి వెంకటేశ్వర్లు. అనుచరులతో మంతనాలు జరపడం, అనుభవంతో ఆలోచించడం, స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుని బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అని ఆలోచించాడు. కాంగ్రెస్ కు కూడా అక్కడ గట్టి లీడర్ కావాలి. ఇరువైపులా ఉప్పు అందింది. అంతే నేతల మధ్య మంతనాలు జరిగాయి. చకా చకా నిర్ణయాలు జరిగాయి. అంతే పార్టీలో చేరడం అయిపోయింది.

పీజీఆర్ కూతురు..

ఇవి కూడా చదవండి

తాటి వెంకటేశ్వర్లు ఒక్కరే కాదు…మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిదీ అదే దారి. ఉన్న పార్టీలో ఉక్క పోతతో కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు విజయారెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం ఆశించినా నిరాశనే ఎదురైంది. పార్టీలో ఉన్నా..అంత వెసులుబాటుగా కనిపించలేదు. విజయారెడ్డి 2012లో వైయస్ఆర్ కాంగ్రెస్‌ లో చేరారు. ఆ తర్వాత 2014లో టిఆర్ఎస్‌లో చేరడం అప్పట్లో కలకలం రేపింది. కానీ ఇప్పుడు జూన్ 23, 2022న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఉత్కంఠను పెంచుతోంది. తన తండ్రి పీజేఆర్ చివరి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి..ఖైరతాబాద్ లో నేను రేసులో ఉన్నాననే సంకేతాలిచ్చింది. అప్పటి నుంచి మొదలైంది అసలు లొల్లి.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతగా అక్కడ గెలిచిన దానం నాగేందర్ 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్‌ను వీడి గులాబీ పార్టీలో చేరారు. దానం కాంగ్రెస్ ని వీడటంతో ఆ మేరకు కాంగ్రెస్ కు అప్పటికప్పుడు బలమైన నేత లేకపోయాడు. అయినా అప్పటి పీసీసీ చీఫ్‌ ఉత్తమకుమార్ రెడ్డి తరుణోపాయం ఆలోచించాడు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్‌కి టికెట్ ఇచ్చారు. ఖైరతాబాద్‌లో పోటీ చేయడం దాసోజుకి పెద్దగా ఇష్టం లేకపోయినా చివరి నిమిషంలో టికెట్ దక్కడంతో బరిలోకి దిగాల్సి వచ్చింది. అయినా ఓటమి తప్పలేదు. అయినా నియోజక వర్గంలో జరిగే కార్యక్రమాలకు దాసోజు హాజరవడమే కాదు..క్యాడర్ లో ఉత్సాహం నింపే పనిచేస్తున్నారు.

కొత్త కాపు…

ఈ లోపు కాంగ్రెస్ లో మారిన సమీకరణలతో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చారు. అంతే ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో స్థానికుడైన డాక్టర్ రోహిన్‌ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. రేవంత్ రెడ్డి సన్నిహితుడుగా పేరున్న రోహిన్ రెడ్డికే టిక్కెట్ అనే టాక్ నడుస్తోంది. 2018 లోనే రోహిన్ రెడ్డి టిక్కెట్ కోసం పావులు కదిపినా దక్కలేదు. ఈ సారి రేసులో తానే అంటున్నారు ఆయన. గత ఎన్నికల్లోనే తనకు టికెట్ దక్కాల్సి ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు ఇవ్వలేదనే వాదన చేస్తున్నారు రోహిన్ రెడ్డి అనుచరులు. అంతే కాదు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆశీస్సులు కూడా ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. రోహిన్ రెడ్డి ఎంట్రీతో దాసోజు శ్రవణ్ ఇరకాటంలో పడ్డ పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఖైరతాబాద్ నియోజక వర్గానికి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు సైతం టికెట్ రేసులో నేను సైతం అంటున్నారు. మహిళా కోటాలో ఈ సారి ఖైరతాబాద్ టికెట్ తనదే అనే ఆమె ధీమాతో ఉండటం ఆసక్తికరమే. ఖైరతాబాద్ కాంగ్రెస్‌ నేతలు టిక్కెట్ కోసం మూడు ముక్కలుగా ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టారనేది నిజం. ఈ లోపే వచ్చారు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి. ఫలితంగా ఒకే టిక్కెట్ కోసం నలుగురు కీలక నేతలు పోటీ పడే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ లో లొల్లి లేకపోతే ఆశ్చర్యం. ఆ మాత్రం ఉంటేనే హస్తం పార్టీ అనే వాదన లేకపోలేదు. అయినా ఇంకోవైపు తన గెలుపుకు కసరత్తులు చేస్తున్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్. వారికి ముందు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మీ మే19, 2022లో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం ఉత్కంఠను పెంచింది. గతంలో అధికార పార్టీ నుంచి బీజేపీలో చేరేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. కాంగ్రెస్ లో చేరుతున్నారు. అక్కడే కాదు రాష్ట్రంలోని చాలా చోట్ల కొత్త నేతల రాకతో ఇప్పుడు నియోజకవర్గాల్లో సందడి పెరిగింది.

పెరుగుట….విరుగుట

జంప్ జిలానీల చేరికతో కమలంలో జోష్ నెలకుంది. 2019, మార్చి19న మాజీ మంత్రి డికే అరుణ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంతో కమలం పార్టీలో జోష్ పెరిగింది. దానికి ముందే మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ 2019, నవంబర్2న చేరినా అంత ఉత్సాహం రాలేదు. ఆ తర్వాత టీడీపీకి చెందిన ఇ. పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, చాడా సురేష్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, షేక్ రహ్మతుల్లాలు బీజేపీలో చేరడం కాషాయదళంలో ఊపు తెచ్చింది. ఆ తర్వాత వరుసగా శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, నాంపల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ మహ్మద్ ఫిరోజ్ ఖాన్, సిర్ఫూర్ కాంగ్రెస్ ఇంఛార్జ్ పాల్వాయి హరీష్ కమలం గుర్తు పార్టీలో చేరారు. ఇదే సమయంలో నాటకీయ పరిణామాల మధ్య టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్యలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అంతా ఆ పార్టీ వైపు చూశారు. ఆ తర్వాత చివరిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ మినహా పెద్ద నేతలెవరు చేరలేదు. అదే సమయంలో పార్టీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి జంప్ చేయడం చర్చనీయాంశమైంది. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు బండి సంజయ్ ఏకపక్షంగా వ్యవహిస్తున్నారని, సీనియర్లను పెద్దగా పట్టించుకోవడం లేదని, పార్టీలో చేరిన వారికి పెద్దగా ప్రాధాన్యత ఉండటం లేదని..ఇప్పటికే అక్కడకు వెళ్లిన ఈటల వంటి వారికి సరైన ప్రయార్టీ లేదనే వాదన సాగుతోంది. అది నిజం కాదని బీజేపీ ఖండిస్తున్నా ఊహగానాలు ఆగడం లేదు.

హస్తం హవా..

తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పిజేఆర్ కుమార్తె విజయారెడ్డి,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి భాగ్యలక్ష్మి చేరడంతో మళ్లీ ఇటు గాలి వీస్తుందనే చర్చ సాగుతోంది. మొన్నటి వరకు బీజేపీ వైపు చూసిన జంప్ జిలానీలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు నడుస్తున్నారు. జులై 2 నుంచి4 వరకు హైదరాబాద్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ వైపు నుంచి కాకుండా కాంగ్రెస్ లో చేరికలు ఉండటం కాస్తంత ఆశ్చర్యమే. ఏఐసీసీ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన తర్వాత కాంగ్రెస్ లో కాస్త కుమ్ములాటలు తగ్గాయి. తూర్పు, పడమరలా ఉండే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు అమెరికా టూర్ లో కలిసి పోయి తిరగడం ఆ పార్టీకి శుభ పరిణామమే. అయినా కాంగ్రెస్ లో ఇప్పటికీ రేవంత్ రెడ్డి వర్గం, భట్టి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, జగ్గారెడ్డి వర్గం, కోమటిరెడ్డి వర్గం అనే ముద్ర ఉంది. ఎన్నికల నాటికి అంతా ఒక్క తాటిపైకి వస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. అందరినీ కలుపుకుపోతే సరే. లేకపోతే ఆ మేరకు కాంగ్రెస్ బోటుకు బొక్క పడక తప్పదు.

బీజేపీ, కాంగ్రెస్ ల కంటే భిన్నంగా వెళుతోంది గులాబీ పార్టీ. గెలుపు గుర్రాలు ఎవరు? ఎవరిని రేసులోపెట్టాలి ఏంటనేది సిఎం కేసీఆర్ కు తెలిసినట్లుగా తెలంగాణలో మిగతా వారికి తెలియదు. అందుకే తాను చేయదల్చుకున్న పనిని పక్కా ప్లాన్ తో చేస్తున్నారంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఎంత మంది బయటకు వెళ్లినా వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు అంతే అంటున్న తీరు రాజకీయవర్గాల్లో ఎన్నికల వేడిని రగిలిస్తోంది. ఏం జరుగుతుందో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

-కొండవీటి శివనాగ్ రాజు, రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు

ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా