Telangana: హైదరాబాద్‌లో పొలిటికల్‌ బ్లాస్ట్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..

హైదరాబాద్‌లో భారీ పొలిటికల్ బేరం గుట్టు రట్టయ్యింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో భారీగా నగదు పట్టుబడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వల వేస్తూ,

Telangana: హైదరాబాద్‌లో పొలిటికల్‌ బ్లాస్ట్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..
Money
Follow us

|

Updated on: Oct 26, 2022 | 9:01 PM

అక్షరాలా వందకోట్ల ఆఫర్‌. కానీ పార్టీ ఫిరాయించాలి. మునుగోడు ఎలక్షన్స్‌కి ముందు చేపట్టిన బిగ్ ఆపరేషన్ ఆకర్ష్.. పోలీసుల ఎంట్రీతో బ్లాస్ట్ అయ్యింది. ఓ మఠాధిపతి రామచంద్రభారతి కేంద్రంగా నందూ, సింహయాజులు బ్రోకర్లు నడిపిన పొలిటికల్ రాయబార వ్యవహారం గుట్టు రట్టు అయ్యింది. ఒకటి కాదు రెండు కాదు.. ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ఆఫర్ చేయగా.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు వారికి బిగ్ షాక్ ఇచ్చారు. మొయినాబాద్‌లోని ఓ ప్రముఖుడి ఫామ్‌హౌస్‌లో పొలిటికల్ బేరసారాలు జరిపిన రామచంద్రభారతి, నందూ, సింహయాజులను అదుపులోకి తీసుకున్నారు. బ్రోకర్లతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు కూడా సీన్‌లో కనిపించడం మరో సంచలనం. టీఆర్ఎస్‌ నేతలు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్హాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నారు.

ఈ ఆపరేషన్‌లో భారీ స్థాయిలో డబ్బుల కట్టలు పట్టుబడ్డాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకే ఈ డబ్బు తీసుకువచ్చారని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ డబ్బును ఎరగా చూపే ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. రూ. 15 కోట్ల వరకు నగదు దొరికినట్లు చెబుతున్న పోలీసులు.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు బేరం కుదిర్చినట్లు తేలింది.

కాగా, మునుగోడులో గెలుపు కోసమే భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పార్టీ ఫిరాయింపుల కోసమేనని ఆరోపిస్తోంది. ఢిల్లీ పెద్దల ప్లాన్ ప్రకారమే.. ఈ బేరసారాలు నడిచినట్లు ఆరోపించారు టీఆర్ఎస్ నేతలు.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.