KTR: కేటీఆర్ భరోసా.. భవిష్యత్‌లో వరదలు రాకుండా ఎలా కంట్రోల్‌ చేయాలనే దానిపై దిశానిర్థేశం

ఇవాళ సిరిసిల్ల ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి కేటీఆర్‌. నియోజకవర్గంలో వదలపై ఆయన సమీక్ష జరిపారు.

KTR:  కేటీఆర్ భరోసా.. భవిష్యత్‌లో వరదలు రాకుండా ఎలా కంట్రోల్‌ చేయాలనే దానిపై దిశానిర్థేశం
Follow us

|

Updated on: Sep 08, 2021 | 9:13 PM

KTR Review: ఇవాళ సిరిసిల్ల ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి కేటీఆర్‌. నియోజకవర్గంలో వదలపై ఆయన సమీక్ష జరిపారు. బాధితులకు భరోసాఇస్తూ.. భవిష్యత్‌లో వరదలు రాకుండా ఎలా కంట్రోల్‌ చేయాలనే దానిపై దిశానిర్థేశం చేశారు. నాన్‌స్టాప్‌ వర్షాలతో జిల్లా కేంద్రంతోపాటు.. పలు గ్రామాలు నీటమునిగాయి. దీంతో పలు ప్రాంతాలు కలియతిరిగి బాధితులను పరామర్శించారు మంత్రి కేటీఆర్‌. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు మంత్రి కేటీఆర్‌. ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పునరావాస ఏర్పాట్లను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల, వేముల‌వాడ ప‌ట్టణాల్లో వ‌ర్షం నీరు ఎక్కడా నిల‌వ‌కుండా ఉండేలా నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించాల‌ని కేటీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. రాబోయే వారం రోజుల్లోగా జిల్లాలో పంట న‌ష్టానికి సంబంధించిన నివేదిక స‌మ‌ర్పించాల‌న్నారు. పట్టణంలో వరదల సమస్య మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. స‌మీక్ష స‌మావేశంలో క‌లెక్టర్ అనురాగ్ జ‌యంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, నీటిపారుద‌ల‌, మున్సిప‌ల్, పంచాయ‌తీ, వ్య‌వ‌సాయ‌, ఇత‌ర సంబంధిత ప్రభుత్వ శాఖ‌ల అధికారులు హాజ‌ర‌య్యారు.

కోనరావుపేట మండలంలోని ధర్మారం చెరువు మత్తడి దూకి నీరు సిరిసిల్ల మండలంలోని బోనాల గ్రామంలోని పెద్ద చెరువు, జంగమయ్యకుంట, శుద్ధగండి చెరువులోకి చేరింది. మూడు చెరువులు పొంగడంతో నీరు సిరిసిల్లను ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన వెంకంపేట, ప్రగతినగర్‌, శివనగర్‌, అశోక్‌నగర్‌, పాతబస్టాండ్‌, సంజీవయ్యగర్‌, నేతన్నచౌక్‌, మెయిన్‌ బజార్‌, శాంతినగర్‌ వార్డులు నీటమునిగాయి.

Read also:  Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముగిసిన రానా విచారణ.. కెల్విన్‌తో కలిపి 7 గంటల పాటు..

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్