Telangana: రెడ్డి, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై కీలక కామెంట్స్ చేసిన మంత్రి కేటీఆర్..

Telangana: రెడ్డీలు పేరుకే అగ్రవ‌ర్ణాలని, వీరిలోనూ చాలా మంది నిరుపేద‌లు ఉన్నార‌ని అన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో జరిగిన జిల్లా రెడ్డి

Telangana: రెడ్డి, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై కీలక కామెంట్స్ చేసిన మంత్రి కేటీఆర్..
Shiva Prajapati

|

Jun 25, 2022 | 8:15 AM

Telangana: రెడ్డీలు పేరుకే అగ్రవ‌ర్ణాలని, వీరిలోనూ చాలా మంది నిరుపేద‌లు ఉన్నార‌ని అన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో జరిగిన జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. పేదల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. తమకు కులం, మతం గురించి తెలియదని, అభివృద్ధే తమ కులం, సంక్షేమమే తన మతం అని చెప్పారు. ప్రతి కులంలోనూ డబ్బున్నవారు, డబ్బులేనివారు ఉన్నారన్నారు మంత్రి కేటీఆర్. పేదవారు ఏ కులంలో ఉన్నవారైనా, వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. వైశ్య, రెడ్డి కులాల కార్పొరేషన్‌ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి, వాటి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి.

తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి కేటీఆర్.. రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు రూ. 5 లక్షల బీమా వచ్చేలా చేశామని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, దీన్ని ముస్సోరిలో ఐఏఎస్‌లకు పాఠ్యాంశంగా చేర్చారని గుర్తుచేశారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో తంగళ్ళపల్లి మండలంలో వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామని వివరించారు కేటీఆర్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu