KTR: తెలంగాణవాసులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు.. పాలమూరు పర్యటనలో మంత్రి కేటీఆర్ వెల్లడి

కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు పునరుద్ఘాటించారు.

KTR: తెలంగాణవాసులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు.. పాలమూరు పర్యటనలో మంత్రి కేటీఆర్ వెల్లడి
Minister Ktr Mahabubnagar District Tour
Follow us

|

Updated on: Apr 14, 2021 | 4:59 PM

Minister KTR Mahabubnagar Tour: కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు పునరుద్ఘాటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధిపనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందిని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదేనని కేటీఆర్ చెప్పారు. జడ్చర్లలో మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌, కావేరమ్మపేట గంగాపూర్‌ బీటీ రహదారి, నల్లచెరువు మినీట్యాంక్‌బండ్‌ అభివృద్ధి పనులను కేటీఆర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత కావేరమ్మపేటలో రెండు పడకగదుల ఇళ్లను పరిశీలించారు. జడ్చర్ల పట్టణంలో మొత్తం రూ.15కోట్ల వ్యయంతో చేపట్టనున్న 8 పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జడ్చర్లకు గతంలో ఎన్నడూ లేనివిధంగా నిధులు కేటాయించి శంకుస్థాపన చేశామని కేటీఆర్‌ అన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధి జరగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న కేటీఆర్.. ఇందుకు అనుగుణంగా ఒక్కొక్క పనిని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో కొద్దిమందికే రూ.75 పింఛను ఇచ్చే వాళ్లని.. దానికీ యుద్ధం చేయాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.200 పింఛను ఇచ్చి విపరీతమైన ప్రచారం చేసుకుందని.. కానీ తమ ప్రభుత్వం రూ.2వేలు ఇస్తోందన్నారు.

దేశంలో 24గంటల పాటు నిర్విరామంగా విద్యుత్ అందిస్తున్న ఘనత ఒక్క తెలంగాణ రాష్ట్రానిదేనన్న కేటీఆర్.. గృహాలతో పాటు వ్యవసాయం, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాకముందు, నేటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని కేటీఆర్‌ వెల్లడించారు.

అంతకు ముందు రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరులో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. పట్టణంలో కొత్తగా నిర్మించనున్న మున్సిపాలిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. కొత్తూరు వై జంక్షన్‌, బటర్‌ఫ్లై వీధిలైట్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొత్తూరులో ఇప్పుడు ఎంతో అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. రీజినల్‌ రింగ్‌రోడ్డు ద్వారా షాద్‌నగర్‌ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇంతటి ఎండాకాలంలోనూ ఇంటింటికి మంచినీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉంటే మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

Read Also…  CM KCR in Sagar by poll: రేపటితో ముగియనున్న సాగర్ ఉప ఎన్నిక ప్రచారం.. మరికాసేపట్లో హాలియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!