Minister KTR: మునుగోడులో గెలిచినా.. ముందస్తుకు వెళ్లబోము.. స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్..

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. మునుగోడులో..

Minister KTR: మునుగోడులో గెలిచినా.. ముందస్తుకు వెళ్లబోము.. స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్..
Minister Ktr Tv9
Follow us

|

Updated on: Oct 30, 2022 | 11:56 AM

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. మునుగోడులో తమ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. మునుగోడు ఉప ఎన్నిక భవిష్యత్తు సూచిక ఏమాత్రం కాదని అన్నారు. అయితే మునుగోడులో గెలిచినంత మాత్రన భవిష్యత్తు మొత్తం ఇలాగే ఉంటుందనే భ్రమలోనూ తాము ఉండబోమన్నారు. ఒక ఉప ఎన్నిక కోసం నియోజకవర్గంలో భారీ స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు మోహరించడంపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు కీలకమన్నారు. అన్ని పార్టీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తమ పార్టీ ఒక ఛాలెంజ్ గా తీసుకుంటుందన్నారు. తాము ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్నా మొదట టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలమని చెప్పారు. ఓ కార్యకర్తగా ఎన్నికల సమయంలో ప్రచారం చేయడం సాధారణమైన విషయమేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక పార్టీ కార్యకర్తనే అని, అందుకే ఒక గ్రామానికి ఇన్ ఛార్జిగా ఉంటూ.. అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. గత ఐదు నెలల కాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ కు దాదాపు 18 నుంచి 20 సార్లు వెళ్లారని, ఎన్నికల కోడ్ రాకుండానే కేంద్రమంత్రులంతా గుజరాత్ లో మోహరించారని, కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని.. ఇది ఎన్నికల్లో లబ్ధి కోసం కాదా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

క్షేత్రస్థాయిలో తమ పార్టీ నాయకులు మోహరించి ఎన్నికల ప్రచారం చేయడం ఇది మొదటిసారి కాదని, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణి దేవి, పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నిక సందర్భంగా 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇదే విధంగా పనిచేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్తు రాజకీయాలను మార్చేసే ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక ఏ మాత్రం కాదని, ఈ ఉప ఎన్నికలో తప్పకుండా గెలుస్తామని చెప్పారు. మరో ఏడాదికి పైగా తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వమే ఉంటుందని, అందుకే నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయాలన్నా టీఆర్ ఎస్ తోనే సాధ్యమనే అభిప్రాయంలో మునుగోడు ప్రజలు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. కేంద్రప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామని ఓ మేనిఫెస్టోను విడుదల చేశారని, గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇదే విధమైన ప్రచారం చేశారని, గెలిచిన తర్వాత కేంద్రప్రభుత్వ నిధులతో ఏం చేశారని ప్రశ్నించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మునుగోడు నియోజకవర్గాన్ని అనాధ చేశారని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో 159 గ్రామ పంచాయతీలు ఉండగా, 115 గ్రామాలకు ఆయన అసలు వెళ్లలేదన్నారు. నియోజకవర్గాన్ని అనాధలా వదిలిపెడితే తాము మాత్రం ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గం పరిధిలో అతి పెద్ద పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చస్త్రశామని, 200 కంపెనీలు శంకుస్థాపనకు రెడీగా ఉన్నాయని, 35వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తండ్రి దివంగత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికి.. నియోజకవర్గంలోని సాగు, తాగునీటి సమస్యలను పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అనేక రిజర్వాయర్లకు పునాది పడిందని, పని కూడా చాలా వరకు పూర్తికావొచ్చిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది సీఏం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి పనులు ఆగలేదని మంత్రి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు!
5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు!
ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన మాజీ మంత్రి
ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన మాజీ మంత్రి
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా