Batukamma: పండక్కి కానుకగా ఇచ్చే చీరకు వెలకట్ట వద్దు.. చీరలు కాలిస్తే సీరియస్ యాక్షన్ తప్పదన్న మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో.. రాజకీయ స్వార్థంతో ఎవరైనా చీరలను మంటల్లో వేసి కాలిస్తే.. తప్పని సరిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

Batukamma: పండక్కి కానుకగా ఇచ్చే చీరకు వెలకట్ట వద్దు.. చీరలు కాలిస్తే సీరియస్ యాక్షన్ తప్పదన్న మంత్రి ఎర్రబెల్లి
Errabelli Dayakar Rao
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Sep 25, 2022 | 1:33 PM

Bathukamma Sarees: తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ పండగ.  తెలంగాణ ఆడబడుచులకు ఈ పండగ కానుకగా ప్రభుత్వం చీరలను ఇస్తుంది.  ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీని అధికారులు చేపట్టారు. ఇప్పటికే చీరలను . రేషన్‌ షాపులు, రెవెన్యూ కార్యాలయాలు, కమ్యూనిటీహాళ్లు వేదికగా పంపిణీ కేంద్రాల నుంచి ఆడబడుచులకు చీరలను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ చీరలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండి పడ్డారు. అంతేకాదు చీరలు నచ్చలేదంటూ వాటిని కాలిస్తే ఊరుకోమని.. సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి.

బతుకమ్మ, దసరా ఉత్సవాల నిర్వహణపై హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో.. రాజకీయ స్వార్థంతో ఎవరైనా చీరలను మంటల్లో వేసి కాలిస్తే.. తప్పని సరిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ కానుక చీరను వెలకట్ట వద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఆయన దసరా పండగక్కి ఆడబడుచులకు ఇచ్చే కానుకగా చూడాలంటూ కోరారు. అంతేకాని.. చీరలు నచ్చలేదంటూ ఎక్కడైనా కాలిస్తే..  కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఎర్రబెల్లి.

ఇవి కూడా చదవండి

అయితే మరోవైపు కొన్ని చోట్ల బతుకమ్మ చీరల పంపిణీపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీరల్లో కనీస నాణ్యత లేదంటున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామంలో మహిళలు బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదంటూ మంటల్లో వేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..