Telangana: మంథనిలో బాహుబలి సినిమాలోని సీన్ రిపీట్.. 2 నెలల బాబును బుట్టలో బజ్జో పెట్టి

మంథనిలో ఇంచుమించు బాహుబలి సినిమాలోని సీన్ రిపీటైంది. మూవీలో చంటిబిడ్డగా ఉన్న మహేంద్ర బాహుబలిని రక్సించే ప్రయత్నంలో శివగామి నదిలో పడుతుంది. తన ప్రాణాలు పోతున్నా.. చిన్నోడిని అరచేతితో పైకెత్తిపట్టుకుని రక్షిస్తుంది.

Telangana: మంథనిలో బాహుబలి సినిమాలోని సీన్ రిపీట్..  2 నెలల బాబును బుట్టలో బజ్జో పెట్టి
Baby Rescued
Follow us

|

Updated on: Jul 14, 2022 | 4:32 PM

Viral Video: వర్షాల తీవ్రత పెరగడంతో  పెద్దపల్లి జిల్లా(Peddapalli district) మంథని(Manthani)పట్టణంలో వరద బీభత్సం పతాక స్థాయికి చేరింది. మర్రివాడ మొత్తం జలదిగ్బంధం అయ్యింది. వరదనీరు చుట్టుముట్టడంతో ఓ ఇంట్లోని కుటుంబసభ్యులు డాబాపైకి ఎక్కారు. అయితే.. వారిలో 2 నెలల బాబుతో  సుమలత అనే బాలింత కూడా ఉంది. తల్లీబిడ్డను ఎలాగైనా కాపాడాలని కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారు. సుమలత బాలింత కావటంతో.. భుజాల వరకు వస్తున్న వరదల్లో నడిచేందుకు చాలా ఇబ్బంది పడింది. అయితే.. తన అక్క కొడుకు రంజిత్.. సుమలతను గట్టిగా పట్టుకుని  సురక్షితంగా వరద నీటిని దాటించి ఒడ్డుకు చేర్చాడు. అయితే అదే సమయంలో.. పసిబిడ్డను ఎత్తుకుని వెళ్లేందుకు కూడా వీలు లేదు.  దీంతో బాబు వాళ్ల పెద్దనాన్న రామ్మూర్తి.. చిన్నోడిని సురక్షితంగా తీసుకెళ్లేందుకు కాస్త వినూత్నంగా ఆలోచించాడు. ఇంట్లోని ఒక పెద్ద బుట్ట లాంటి పాత్రలో పసికందును  పడుకోబెట్టి.. చలి తగలకుండా వెచ్చగా ఉండేలా చుట్టూ దుస్తులు పెట్టాడు. బాహుబలి సినిమాలోని సీన్ మాదిరి.. ఆ బాబు ఉన్న పాత్రను రెండు చేతులతో పైకెత్తి పట్టుకుని.. జాగ్రత్తగా నడుస్తూ ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ దృశ్యాలను చుట్టుపక్కల ప్రాంతాల వారు వీడియో తీశారు. దీంతో నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి