Telangana lockdown: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

lockdown in Telangana: తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో 10 రోజులపాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కరోనా కేసులు పెద్దగా నమోదుకాకపోయినప్పటికీ.. ప్రజా ఆరోగ్యాన్ని

Telangana lockdown: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?
Cm Kcr
Follow us

|

Updated on: May 30, 2021 | 7:21 PM

Lockdown in Telangana: తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో 10 రోజులపాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కరోనా కేసులు పెద్దగా నమోదుకాకపోయినప్పటికీ.. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరో పది రోజులపాటు లాక్‌డౌన్‌ను పెంచాలని కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రేపటితో తెలంగాణలో లాక్‌డౌన్ గడువు ముగుస్తోన్న నేపథ్యంలో కేబినెట్ ఈ రోజు సమావేశమైంది. కాగా లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని ప్రభుత్వం మరో మూడు గంటలు పెంచింది.

ఇందులో భాగంగా ఉదయం 10 గంటల వరకు ఉన్న సడలింపను మధ్యాహ్నం ఒంటి గంట వరకు పెంచారు. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరడానికి మరో గంట పాటు అవకాశం కల్పిస్తారు. అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల దాకా కఠినంగా లాక్డౌ‌న్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

సీఎంఓ ట్విట్..

మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ పొడిగింపుతోపాటు.. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో అందుతున్న కరోనా వైద్య‌సేవ‌లు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, మెడికల్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

Also Read:

Cinna Jeeyar Swamy : దుష్ప్రభావాలు లేవంటూనే ఆనంద‌య్య మందుపై అభ్యంత‌ర‌మెందుకు?.. నిలదీసిన చినజియర్ స్వామి..

సచివాలయానికి బాంబు బెదిరింపు.. ఉరుకులు… పరుగులు పెట్టిన మహా పోలీసులు